ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

APRTC: ‘ఆ డ్రైవర్‌ను తొలగించలేదు’... ఏపీఆర్టీసీ ట్వీట్

ABN, First Publish Date - 2023-02-08T13:38:27+05:30

‘‘యువగళం’’ పాదయాత్రలో లోకేష్‌కు షేక్‌ హ్యాండ్ ఇచ్చి.. ఆర్టీసీ డ్రైవర్ జాబ్‌ కోల్పోయాడు అంటూ వస్తున్న వార్తలపై ఏపీ ఆర్టీసీ యాజమాన్యం స్పందించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ‘‘యువగళం’’ (Nara Lokesh Yuvagalam Padayatra) పాదయాత్రలో లోకేష్‌కు షేక్‌ హ్యాండ్ ఇచ్చి.. ఆర్టీసీ డ్రైవర్ (RTC Driver) జాబ్‌ కోల్పోయాడు అంటూ వస్తున్న వార్తలపై ఏపీ ఆర్టీసీ యాజమాన్యం (AP RTC)స్పందించింది. ఆర్టీసీ డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించలేదు అంటూ యాజమాన్యం ట్వీట్ చేసింది. అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ ఏపీఆర్టీసీ ట్వీట్టర్ వేదికగా హెచ్చరించింది.

కాగా... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర (YuvaGalam Padayatra) చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేష్‌(Nara Lokesh)కు ఓ బస్సు ఎదురవగా... ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో పాటు అందులో ఉన్న ప్రయాణికులు లోకేష్‌ (Lokesh Padayatra)కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ తన మొబైల్‌ను చూపిస్తూ యువనేత(Lokesh YuvGalam)కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అయితే లోకేష్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వడంతో ఆర్టీసీ డ్రైవర్‌ను విధుల్లో నుంచి తొలగించారంటూ కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ పోస్టు కాస్తా వైరల్ అయింది. దీనిపై లోకేష్‌ కూడా స్పందిస్తూ... ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విధుల్లో ఉండి షేక్‌ హ్యాండ్ ఇస్తే విధుల నుంచి తొలగిస్తారా అంటూ యువనేత మండిపడ్డారు. ఈ వార్త సోషల్ మీడియాలో షికార్లు చేయడంతో ఆర్టీసీ యాజమన్యం వెంటనే క్లారిటీ ఇచ్చింది. ఆర్టీసీ డ్రైవర్‌ను విధుల్లో నుంచి తొలగించారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.

Updated Date - 2023-02-08T13:46:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising