జోనల్ వర్క్‌షాపు వద్ద ఉద్యోగుల నిరసన
ABN , First Publish Date - 2023-04-01T01:00:56+05:30 IST
ఆర్టీసీ జోనల్ వర్కషాపులో పీటీడీ ఉద్యోగులు అపరిష్కృత డిమాండ్లను పరిష్కరిం చాలని కోరుతూ నేషనల్ మజ్దూర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వర్క్‌షాపు వద్ద భోజన విరామ సమయంలో ఉద్యోగులు ఎర్రబ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు.

జోనల్ వర్క్‌షాపు వద్ద
ఉద్యోగుల నిరసన
భవానీపురం, మార్చి 31: ఆర్టీసీ జోనల్ వర్కషాపులో పీటీడీ ఉద్యోగులు అపరిష్కృత డిమాండ్లను పరిష్కరిం చాలని కోరుతూ నేషనల్ మజ్దూర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వర్క్‌షాపు వద్ద భోజన విరామ సమయంలో ఉద్యోగులు ఎర్రబ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ ఉద్యోగులకు మ్యాన్ అవర్ రేటు అమలు చేయడం లేదని, పాత ఎరియర్లు చెల్లించడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దశల వారీగా ఆందోళన చేస్తున్నా చలనం ఉండటం లేదన్నారు. వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే మరింత ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మూసేసిన క్యాంటీన్‌ను పునరుద్ధరించాలని, అంబులెన్స్‌ను ఉపయోగించాలని డిమాండ్ చేశారు. నాన్ ఆపరేషన్ సెక్రటరీ ఎస్. కళ్యాణ్‌కుమార్, అధ్యక్షుడు ఎ. నాగేశ్వరరావు, వర్క్‌షాపు సెక్రటరీ సీహెచ్. శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ ఎస్.స్వామిలు పాల్గొన్నారు.