Vijayawada : ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. విజయవాడ డివిజన్‌లో ఈ రైళ్లన్నీ బంద్..
ABN , First Publish Date - 2023-11-23T07:47:45+05:30 IST
విజయవాడ డివిజన్‌లో భద్రతా పనుల వల్ల పలు రైళ్లను అధికారులు రద్దు చేస్తున్నారు. ఈ నెల 27 నుంచి డిసెంబర్ 3 వరకూ మూడు రైళ్లు రద్దయ్యాయి. గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ రద్దైంది. గుంటూరు- విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్.. మచిలీపట్నం-విశాఖ ఎక్స్‌ప్రెస్ రద్దు కానున్నాయి.

విజయవాడ : విజయవాడ డివిజన్‌లో భద్రతా పనుల వల్ల పలు రైళ్లను అధికారులు రద్దు చేస్తున్నారు. ఈ నెల 27 నుంచి డిసెంబర్ 3 వరకూ మూడు రైళ్లు రద్దయ్యాయి. గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ రద్దైంది. గుంటూరు- విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్.. మచిలీపట్నం-విశాఖ ఎక్స్‌ప్రెస్ రద్దు కానున్నాయి.
ఈ నెల 28 నుంచి డిసెంబర్ 4 వరకూ మూడు రైళ్లు రద్దు కానున్నాయి. వాటిలో రాయగడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్.. విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్.. విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లు రద్దు కానున్నాయి. ఇక నవంబర్ 27, 28, 29, డిసెంబర్ 1, 2 తేదీల్లో 2 రైళ్లు రద్దు కానున్నాయి. విజయవాడ-విశాఖ రైలు.. విశాఖ-విజయవాడ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రద్దు కానున్నాయి. ఈ నెల 27 నుంచి డిసెంబర్ 3 వరకు 2 రైళ్లు రద్దు చేయడం జరిగింది. కాకినాడ-విశాఖ మెమూ స్పెషల్ రైలు... విశాఖ-కాకినాడ మెమూ స్పెషల్ రైలు రద్దు చేయడం జరిగింది.