ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM Jagan Corruption: జగన్ అవినీతిపై బీజేపీ సమరం

ABN, First Publish Date - 2023-04-26T15:15:48+05:30

ఢిల్లీ: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) అవినీతిపై బీజేపీ (BJP) సమర శంఖం పూరించనుంది. ఈ మేరకు బీజేపీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) అవినీతిపై బీజేపీ (BJP) సమర శంఖం పూరించనుంది. ఈ మేరకు బీజేపీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చెప్పినా రాష్ట్ర నాయకత్వం (State Leadership) పట్టించుకోక పోవడంపై అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో జరుగుతున్న అవినీతిపై చార్జిషీట్‌ (Charge Sheet)లు దాఖలు చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. జిల్లాల వారీగా అంశాలను ఖరారు చేసి... ప్రతి పోలీస్ స్టేషన్‌లో చార్జిషీట్‌లతో పిర్యాదు చేయాలని రాష్ట్ర నేతలకు ఆదేశించింది.

అంశాల వారీ చార్జిషీట్‌లు రూపొందించేందుకు జాతీయ నాయకత్వం నలుగురు నేతలతో కమిటీ నియమించింది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి, పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌లతో కమిటి ఏర్పాటు చేసింది. మద్యం, ఇసుక, మట్టి, విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ మీటర్లు, ట్రాన్స్‌ఫార్మాస్, ఆర్డీఎస్ఎస్, భూ ఆక్రమణలు, మైనింగ్, కాంట్రాక్టులు, పోలవరం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, సెంటు భూమి పథకంలో అక్రమాలు జరిగాయి. వైజాగ్‌లో భూ ఆక్రమణలు, రిషికొండలో చోటు చేసుకున్న అక్రమాలు... వంటి విషయాలపై బీజేపీ కమిటీ చార్జిషీట్‌లు రూపొందించనుంది.

బీజేపీ కమిటీ మే 5వ తేదీ నుంచి కార్యాచరణ ప్రారంభించనుంది. కమిటీ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పలు చోట్ల స్వయంగా చార్జిషీట్‌లు దాఖలు చేయనున్నారు. ఐదు నెలల క్రితం... వైజాగ్‌లో పార్టీ నేతలతో జరిగిన భేటీలో రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై చార్జిషీట్ దాఖలు చేయాలని పార్టీ నేతలకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం చేశారు. అప్పటి నుంచి రాష్ట్ర నాయకత్వం స్పందించకపోవడంతో... కమిటీ ఏర్పాటు చేస్తూ బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే రెండు, మూడు రోజుల్లో విజయవాడలో ఈ కమిటీ భేటీ కానుంది.

Updated Date - 2023-04-26T15:15:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising