ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bonda Uma: డబ్బులేదంటున్న జగన్.. దేశంలోనే అత్యంత ధనవంతుడు ఎలా అయ్యారు?..

ABN, First Publish Date - 2023-04-07T14:49:10+05:30

విజయవాడ: కల్లబొల్లి కబుర్లు, పచ్చి అబద్ధాలతో మరోసారి జనాన్ని వంచించడానికి సీఎం జగన్ సిద్ధమయ్యారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విజయవాడ: కల్లబొల్లి కబుర్లు, పచ్చి అబద్ధాలతో మరోసారి జనాన్ని వంచించడానికి సీఎం జగన్ (CM Jagan) సిద్ధమయ్యారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswararao) విమర్శించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తనకు డబ్బులేదంటున్న ముఖ్యమంత్రి దేశంలోనే అత్యంత ధనవంతుడు ఎలా అయ్యారని ప్రశ్నించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని సంపాదించిన లక్షల కోట్లు (Lakhs of Crores) ఎక్కడ దాచారన్నారు. రూ.43 వేల కోట్ల అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైలుకు ఎందుకు వెళ్లారని నిలదీశారు.

15 సంవత్సరాల నుంచి బెయిల్‌పై బయట తిరుగుతూ, అవినీతికేసుల విచారణకు ఎందుకు హాజరుకావడంలేదో సీఎం జగన్ ప్రజలకు చెప్పాలని బోండా ఉమ డిమాండ్ చేశారు. ‘ది ప్రింట్ వెబ్ సైట్ (The Print Website)’ కథనంలో పేర్కొన్న తన ఆస్తులపై జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారన్నారు. పత్రికలు లేవంటున్న జగన్‌కు సాక్షి మీడియా (Sakshi Media) ఎవరిదో చెప్పాలన్నారు. తనదికానిదానికి ప్రజల సొమ్మును ఎందుకు దోచిపెడుతున్నారని ప్రశ్నించారు. వినీతి సొమ్ము పెట్టుబడిగా పెట్టిన బ్లూ మీడియా (Blue Media)పై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారన్నారు. జగన్ తుమ్మినా, దగ్గినా బ్లూ మీడియా ఎందుకు వార్తలు ప్రసారం చేస్తోంది?... కన్న తల్లిని, చెల్లిని రోడ్లపాలు చేసిన సీఎం జగన్ రాష్ట్రంలోని ఆడబిడ్డల్ని రక్షిస్తాడంటే ఎలా నమ్మాలన్నారు. సొంత పిన్ని పుస్తెలు తెంపి, బాబాయ్ వివేకను చంపినవారితో తాడేపల్లిలో విందులు, వినోదాల్లో పాల్గొంటున్న జగన్, ప్రజల్ని రక్షిస్తారా? అని బోండా ఉమ ప్రశ్నించారు.

Updated Date - 2023-04-07T14:49:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising