Bonda Uma: అవినీతి పత్రికకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు: బొండా ఉమ
ABN, First Publish Date - 2023-11-17T15:25:34+05:30
అమరావతి: తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని పిచ్చికూతలు కూసే గొట్టంగాళ్లకు.. అవినీతి పత్రికకు సమాధానం చెప్పాల్సిన అవసరం తమకుగానీ, తమ పార్టీకి లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.
అమరావతి: తాడేపల్లి ప్యాలెస్ (Tadepalli Palace)లో కూర్చొని పిచ్చికూతలు కూసే గొట్టంగాళ్లకు.. అవినీతి పత్రికకు సమాధానం చెప్పాల్సిన అవసరం తమకుగానీ, తమ పార్టీకి లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswararao) అన్నారు. శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాక్షి విషపు కథనాలు ప్రచురిస్తేనో.. జగన్ రెడ్డి (Jagan Reddy).. అతని దోపిడీ ముఠా నోళ్లేసుకుని విషప్రచారం చేస్తేనో వాస్తవాలు మరుగున పడిపోవన్నారు. తెలుగుదేశం పార్టీ (TDP)కి వచ్చే విరాళాల సొమ్ము లెక్కలు.. కార్యకర్తల సంక్షేమానికి వెచ్చిస్తున్న ప్రతిపైసా వివరాలు ఎన్నికల కమిషన్‌కు.. ఇన్‌కంటాక్స్‌కు ఎప్పటికప్పుడు అందిస్తున్నామని స్పష్టం చేశారు.
40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఇచ్చే ప్రతి పైసాకు లెక్కచెబుతున్నామని, నాలుగున్నరేళ్లుగా స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill Development Case)ను విచారిస్తున్న సీఐడీ (CID) చివరకు ఏమీ తేల్చలేక విరాళాల సొమ్ములో బొక్కలు వెతికే పనిలో పడిందని బోండా ఉమ మండిపడ్డారు. టీడీపీ కార్యాలయానికి నోటీసులిచ్చినట్టే, వైసీపీ కేంద్ర కార్యాలయానికి వస్తున్న డబ్బు వివరాలు కావాలని సీఐడీ అడగగలదా? అని ప్రశ్నించారు. దేశంలోనే ధనవంతుడైన సీఎంగా జగన్ రెడ్డి ఎలా నిలిచారో విచారించి, ప్రజల ముందు వాస్తవాలు ఉంచగలదా? అని నిలదీశారు. వైసీపీకి వచ్చిన రూ.150 కోట్ల నల్లధనం సాక్షి ఖాతాల్లోకి వెళ్లి.. ఎలా తిరిగి అధికారపార్టీకి వచ్చిందో నిగ్గుతేల్చే ధైర్యం సీఐడీకి ఉందా? అని బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.
Updated Date - 2023-11-17T15:25:37+05:30 IST