Bonda Uma: సీఈసీ ఇచ్చిన ఆదేశాలు ఏపీలో అమలు కావడంలేదు..
ABN, First Publish Date - 2023-11-16T18:02:20+05:30
విజయవాడ: ఎన్నికల ముసాయిదాలో అవకతవకలపై గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్‌కు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రంలో అమలు కావడంలేదన్నారు.
విజయవాడ: ఎన్నికల ముసాయిదాలో అవకతవకలపై గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ (Swapnil Dinkar)కు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు (Bonda Umamaheswararao) ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రంలో అమలు కావడంలేదన్నారు. కింద స్థాయి అధికారులు ఎన్నికలకు అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని, 25 ఏళ్ల క్రితం చనిపోయిన వారి పేర్లు ఓటర్ లిస్టులో ఉన్నాయన్నారు. డోర్ టు డోర్ వెరిఫికేషన్ జరిగిన తరవాత కూడా తప్పులు ఎందుకు దొర్లుతున్నాయని ప్రశ్నించారు. ఒక్క విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే 12వేల బోగస్ ఓట్లు (Bogus Votes) ఉన్నాయన్నారు.
62వ డివిజన్ కార్పొరేటర్ అలంపురు విజయలక్ష్మి పేరు మీద రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని, వారి కుటుంబంలో మొత్తం 10 దొంగ ఓట్లు ఉన్నాయని.. దొంగ ఓట్లపై కలెక్టర్‌కు, విఎంసి కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని బోండా ఉమా తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నాయకులకు రెండు ఓట్లు ఇస్తారా?.. అని ప్రశ్నించారు. వై నాట్ 175 అని జగన్ (Jagan) ఇందుకే చెప్తున్నారన్నారు. ఇదొక ఆర్గనైజింగ్ స్కాం అని, ఇప్పటికే అనేక మార్లు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేశామని, చర్యలు మాత్రం శూన్యమని బోండా ఉమామహేశ్వరరావు అన్నారు.
Updated Date - 2023-11-16T18:02:21+05:30 IST