కులమతాలకతీతంగా సంక్రాంతి జరపడం శుభపరిణామం
ABN , First Publish Date - 2023-01-15T01:04:12+05:30 IST
కుల, మతాలకు అతీతంగా ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం శుభపరిణామం అని కృష్ణలంక సీఐ ఎం.వి.దుర్గారావు అన్నారు.

కులమతాలకతీతంగా సంక్రాంతి జరపడం శుభపరిణామం
లబ్బీపేట: కుల, మతాలకు అతీతంగా ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం శుభపరిణామం అని కృష్ణలంక సీఐ ఎం.వి.దుర్గారావు అన్నారు. లబ్బీపేటలో శనివారం ముస్లిం సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ హిందూ, ముస్లిం అనే భావన లేకుండా కులమతాలకు అతీతంగా ఈ పండుగను నిర్వహించడం చాల సంతోషం అన్నారు. ముస్లిం సంక్షేమ సమితి అధ్యక్షుడు ముక్తార్ అలీ మాట్లాడుతూ ఎవరి మతాచారాలను వారు పాటిస్తూ ఇతర మతాలను గౌరవించాలనే ఉద్దేశంతో గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా మన్నారు. గవర్నరుపేట సీఐ డి.సురేష్, కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ అలీమ్, మీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.