ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu Arrest: చంద్రబాబు వాంగ్మూలం తీసుకున్న ఏసీబీ కోర్టు..

ABN, First Publish Date - 2023-09-10T09:00:42+05:30

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్‌ రిపోర్ట్‌పై ఆదివారం ఉదయం ఏసీబీ కోర్టులో విచారణ ప్రారంభమైంది. చంద్రబాబు తరపున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. తర్వాత న్యాయమూర్తి చంద్రబాబు వాంగ్మూలం తీసుకున్నారు.

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత (TDP Chief) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రిమాండ్‌ రిపోర్ట్‌ (Remand Report)పై ఆదివారం ఉదయం ఏసీబీ కోర్టు (ACB Court)లో విచారణ ప్రారంభమైంది. చంద్రబాబు తరపున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (Siddhartha Luthra) వాదనలు వినిపించారు. తర్వాత న్యాయమూర్తి చంద్రబాబు వాంగ్మూలం తీసుకున్నారు. సీఐడీ (CID) తరపున అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి బృందం వాదనలు వినిపించారు. ఈ క్రమంలో సీఐడీ అధికారులు కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించారు. ముందు చంద్రబాబు పేరు ఎఫ్ఐఆర్‌ (FIR)లో పేర్కొనలేదు. కాసేపటి క్రితమే ఆయన పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ఏసీబీ కోర్టులో వాడీ వేడిగా వాదనలు కొనసాగుతున్నాయి.

కాగా చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత ఆయనకు నిద్రపోయే అవకాశం లేకుండా పోలీసులు వ్యవహరించారు. విశ్రాంతి లేకపోవడం... సుదీర్ఘ ప్రయాణం, విచారణ పేరుతో గంటల సమయం అటు ఇటు తిప్పటం పట్ల తెలుదేశం శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. అధినేత చంద్రబాబును చూసి పార్టీ నేతలు, కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబును చూసేందుకు హాస్పిటల్, కోర్టు పరిసర ప్రాంతాలలో జనం పడిగాపులు గాస్తున్నారు.

Updated Date - 2023-09-10T09:04:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising