ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: రేపు హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు చంద్రబాబు బెయిల్ పిటీషన్

ABN, First Publish Date - 2023-10-26T07:07:41+05:30

అమరావతి: తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బెయిల్ పిటీషన్ శుక్రవారం హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు రానుంది. చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ కోసం వేసిన అనుబంధ పిటీషన్‌పై న్యాయస్థానం విచారణ జరపనుంది.

అమరావతి: తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బెయిల్ పిటీషన్ (Bail Petition) శుక్రవారం హైకోర్టు వెకేషన్ బెంచ్ (High Court Vacation Bench) ముందుకు రానుంది. చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ కోసం వేసిన అనుబంధ పిటీషన్‌పై న్యాయస్థానం విచారణ జరపనుంది. గతంలో స్కిల్ కేసు (Skill Case)లో చంద్రబాబు బెయిల్ పిటీషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court) తిరస్కరించిన విషయం తెలిసిందే.

దసరా సెలవులకు ముందు హైకోర్టులో చంద్రబాబు బెయిల్‌ పిటీషన్‌పై విచారణ జరిగింది. అనారోగ్య కారణాలు దృష్ట్యా ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. లంచ్ తరువాత పిటీషన్ విచారణకు రాగా వెకేషన్ బెంచ్ ముందుకు బదిలీ చేయాలని బాబు తరపు న్యాయవాదులు కోరారు. ఈ నేపథ్యంలో శుక్రవారం హైకోర్టులో సింగిల్ బెంచ్ ముందు ఎనిమిదవ నంబర్ కేసుగా పిటీషన్ లిస్ట్ అయింది.

కాగా చంద్రబాబు ఆరోగ్యంపై (CBN Health) జగన్ సర్కార్ (Jagan Govt) అడుగడుగునా నిర్లక్ష్యం వహిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాబు అరెస్ట్ (Chandrababu Arrest) అయ్యి ఇప్పటికి 47 రోజులు అవుతున్నా ఆయన ఆరోగ్యంపై ఎలాంటి ప్రత్యేక దృష్టి పెట్టలేదని.. కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. చంద్రబాబు డీ హైడ్రోషన్‌కు గురికావడం, చర్మ సంబంధిత ఇబ్బందులు తలెత్తడం, బరువు తగ్గడం.. ఇవన్నీ ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వం తీరు మార్చుకోవట్లేదు. ఆయన ఆరోగ్యంపై జైలు అధికారులు ఒకలా.. డాక్టర్‌లు మరోలా చెబుతుండటంతో జైలు లోపల ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి...

Updated Date - 2023-10-26T07:07:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising