High Court: చంద్రబాబు కేసు విచారణ మధ్యాహ్నం 2:15కు వాయిదా
ABN, First Publish Date - 2023-10-30T13:28:24+05:30
అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రెగ్యులర్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై వాదనలు సోమవారం మధ్యాహ్నం 2:15 గంటలకు హైకోర్టు వాయిదా వేసింది. బాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్ర ఆన్‌లైన్‌లో వర్చువల్‌గా వాదనలు వినిపిస్తున్నారు.
అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (Skill Development Case)లో రెగ్యులర్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై వాదనలు సోమవారం మధ్యాహ్నం 2:15 గంటలకు హైకోర్టు (High Court) వాయిదా వేసింది. బాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్ర (Siddhartha Luthra) ఆన్‌లైన్‌లో వర్చువల్‌గా వాదనలు వినిపిస్తున్నారు. మెడికల్ గ్రౌండ్స్‌పై వాదనలు వినిపించారు. చంద్రబాబుకు అరోగ్య పరిస్థితి రీత్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. రెగ్యులర్ బెయిల్‌తో పాటు మధ్యంతర బెయిల్‌పై వాదనలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం లంచ్ తర్వాత మళ్ళీ వాదనలు కొనసాగనున్నాయి.
కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ కేస్‌లో రెగ్యులర్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై సోమవారం ఉదయం హైకోర్టులో (AP High Court) విచారణ ప్రారంభమైంది. వెకేషన్ బెంచ్‌లో న్యాయమూర్తి ‘నాట్ బిఫోర్ మి’ అనటంతో ఈరోజు రెగ్యులర్ బెంచ్‌లో విచారణకు చంద్రబాబు బెయిల్ పిటిషన్ లిస్ట్ అయింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి రీత్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని బాబు తరుపు న్యాయవాదులు అడుగుతున్నారు. హెల్త్ రిపోర్ట్‌లను అటాచ్ చేస్తూ చంద్రబాబు తరుపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
Updated Date - 2023-10-30T13:30:52+05:30 IST