ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CID Notice: టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ నోటీసులు... ఇంతకీ ఆ మ్యాగజైన్ సంగతేంటి?

ABN, First Publish Date - 2023-04-11T16:52:04+05:30

టీడీపీ కేంద్ర కార్యాయానికి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాయానికి (TDP Central Office) సీఐడీ (CID) అధికారులు నోటీసులు ఇచ్చారు. మంగళవారం టీడీపీ కార్యాలయానికి వచ్చిన సీఐడీ అధికారులు టీడీపీ జనరల్ సెక్రటరీ (TDP General Secretary పేరుతో నోటీసులు ఇచ్చి వెళ్లారు. పార్టీ అనుబంధ పత్రిక ‘‘చైతన్య రథం’’లో వస్తున్న వార్త కథనాలపై సీఐడీ వివరాలు సేకరించింది. ఇంతకు చైతన్య రథం పత్రిక ఎడిటర్ ఎవరు?.. నిర్వహణ ఎవరు చూస్తున్నారు? అంటూ ప్రశ్నలు వేశారు. లాయర్ చేతికి నోటీసులు అందజేసి సీఐడీ అధికారులు వెళ్లిపోయారు.

కాగా... ‘‘చైతన్య రథం’’ పేరుతో టీడీపీ డిజిటల్ మ్యాగజైన్‌ను నడుపుతోంది. రోజూ దాదాపు 24 పేజీలతో వచ్చే ఈ మ్యాగజైన్‌లో టీడీపీకి సంబంధించిన వార్తా విశేషాలను ఇస్తారు. అలాగే అధికారపక్షం చేస్తున్న అక్రమాల వ్యవహారాలపై మ్యాగజైన్‌లో కథనాలు ప్రచురిస్తారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (AP Minister Buggan Rajendranath Reddy) గురించి ‘‘అపరిచితుడు’’ అనే శీర్షికతో ‘‘బుగ్గన భూదాహం’’ అనే ఉపశీర్షికతో కథనం ప్రచురితం అయ్యింది. ఇందులో బుగ్గన ఆస్తులపై ప్రచురించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్ల సమయంలో రిటర్నింగ్ అధికారికి ఇచ్చిన అఫిడవిట్‌ను తీసుకుని ఆస్తులపై కథనం ప్రచురించారంటూ చైతన్య రథంపై కేసు నమోదు అయ్యింది.

మంత్రి బుగ్గనకు అప్రతిష్ట కలిగించే విధంగా, గౌరవ మర్యాదలకు భంగం కలిగించారంటూ సెక్షన్లు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఈరోజు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న సీఐడీ అధికారులు సీఆర్పీసీలోని సెక్షన్ 91 కింద నోటీసులు ఇచ్చారు. చైతన్య రథం పత్రిక ఎడిటర్ ఎవరు?.. నిర్వహణ ఎవరు చూస్తున్నారు అని?.. అలాగే అపరిచుతుడు అనే పేరుతో ఈ కథనాన్ని రాసిన రిపోర్డర్ ఎవరు? అని, చైతన్య రథం డిజిటల్ మ్యాగజైన్‌కు సంబంధించి ఒరిజనల్ కాపీ అందజేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మూడు నెలల క్రితమే శీర్షికపై కేసు నమోదు చేసినప్పటికీ ఈరోజు నోటీసులు ఇవ్వడంలో ఆంతర్యమేంటి అంటూ టీడీపీ వర్గాలు ఆరా తీస్తున్నాయి.

Updated Date - 2023-04-11T16:56:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising