CM Jagan: క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం కానున్న సీఎం జగన్
ABN, First Publish Date - 2023-09-26T16:08:46+05:30
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ చార్జీలతో భేటీ కానున్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో (Camp Office) కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ చార్జీలతో భేటీ కానున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్షించనున్నారు. అలాగే ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నివేదికను ప్రదర్శించనున్నారు. సాధారణ ఎన్నికల సన్నద్దతపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై జగన్మోహన్ రెడ్డి చర్చించనున్నారు.
Updated Date - 2023-09-26T16:08:46+05:30 IST