ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: మీ సేవలను ప్రజలు గుర్తుంచుకుంటారు... గవర్నర్‌తో జగన్

ABN, First Publish Date - 2023-02-13T14:36:15+05:30

రాష్ట్ర గవర్నర్‌ బిష్వభూషణ్ హరిచందన్‌‌ దంపతులతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దంపతులు భేటీ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌‌ (Governor Biswabhushan Harichandan) దంపతులతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దంపతులు (Chief Minister Jagan Mohan Reddy couple) భేటీ అయ్యారు. సోమవారం రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా సమావేశమ్యారు. గవర్నర్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్ నుంచి చత్తీస్‌ఘడ్ గవర్నర్‌గా బదిలీ అయిన నేపథ్యంలో వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్‌గా రాష్ట్రానికి అందించిన సేవలను సీఎం (AP CM) కొనియాడారు. రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గవర్నర్‌ (AP Governor) గా అందించిన సేవలను గుర్తుంచుకుంటారన్నారు. మచ్చలేని వ్యక్తిత్వంతో, కరోనా విపత్కర పరిస్థితులను అధిగమించి, రాష్ట్రం ప్రగతి పథంలో పయనించడానికి ఎంతో సహకారాన్ని అందించారన్నారు.

అధికార కార్యకాలాపాల నిర్వహణలో ప్రజాస్వామ్యస్ఫూర్తితో, హుందాతనంతో వ్యవహరించారని తెలిపారు. అత్యుత్తమ రాజకీయ పరిణీతి చూపి రాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకున్నారన్నారు. గవర్నర్‌గా రాష్ట్రానికి అందించిన సేవలను కొనియాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల (Central and State Governments) మధ్య సమన్వయం సాధించి, మంచి సంబంధాలు సజావుగా సాగడంలో కీలక భూమిక పోషించారన్నారు. గవర్నర్ రాజ్యాంగానికి వన్నెతెచ్చారని కొనియాడారు. ఆత్మీయతను తెలుగు ప్రజలకు పంచారన్నారు. రాష్ట్రం నుంచి వెళ్లవలసి రావటం బాధాకరమైనా, దేశంలోని మరో రాష్ట్రానికి గవర్నర్‌గా వెళ్లడం ద్వారా అక్కడి ప్రజలకు మేలు చేయగలుతారని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YCP Chief) పేర్కొన్నారు.

Updated Date - 2023-02-13T14:36:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising