AP News: ఏప్రిల్ 2న విజయవాడలో అహింస రన్.. పోస్టర్ ఆవిష్కరించిన ఢిల్లీరావు
ABN, First Publish Date - 2023-03-04T14:52:53+05:30
భౌతిక, భావోద్వేగ హింస ఉన్న ప్రస్తుత సమాజంలో అహింస అనేది చాలా ముఖ్యం అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు (NTR District Collector Delhi Rao) అభిప్రాయపడ్డారు
విజయవాడ: భౌతిక, భావోద్వేగ హింస ఉన్న ప్రస్తుత సమాజంలో అహింస అనేది చాలా ముఖ్యం అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు (NTR District Collector Delhi Rao) అభిప్రాయపడ్డారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (Jain International Trade Organization) (జితో) ఆధ్వర్యంలో ఏప్రిల్ 2న దేశ వ్యాప్తంగా అహింస రన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన అహింస రన్ ర్యాలీ పోస్టర్‌ను కలెక్టర్ ఢిల్లీరావు, జితో ఛైర్మెన్ అశోక్, చీఫ్ సెక్రటరీ మనీష్ ఆవిష్కరించారు. ఈ అహింస రన్‌లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రాచీనమైన హిందూయిజం, బుద్ధిజం, జైనిజం అహింసను బోధిస్తాయని తెలిపారు. అహింస బోధనలను ఆచరణలో పెట్టేది జైనులేనని పేర్కొన్నారు. సమాజం నుంచి పొందిన లాభాల్లో కొంత సమాజానికి తిరిగి ఇస్తున్నారని ప్రశంసించారు. అహింస రన్ (Non violence run) ద్వారా సమాజంలో కొంత అయినా మార్పు రావాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
జితో ఛైర్మెన్ అశోక్, చీఫ్ సెక్రటరీ మనీష్..
మెరుగైన ప్రపంచం కోసం శాంతి, అహింస, ప్రేమ కోసం అహింసా రన్‌ను ఏప్రిల్ 2న దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు జితో ఛైర్మెన్ అశోక్, చీఫ్ సెక్రటరీ మనీష్ వెల్లడించారు. అహింస విషయంలో దేశం మొత్తం కలిసి రావాలని కోరారు. భారతదేశంలో (India) లక్ష మందికి పైగా ప్రజలు ఈ రన్‌లో భౌతికంగా పాల్గొంటారని.. డిజిటల్ మీడియా (Digital media) ద్వారా కోటి మందికి పైగా ప్రజలు చేరుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి: షాకింగ్ ఘటన.. పక్కింటి వాళ్లు పెళ్లికి పిలవలేదని ఓ వ్యక్తి వింత నిర్వాకం..!
Updated Date - 2023-03-04T14:53:38+05:30 IST