CPM: మోదీ కనుసన్నల్లోనే జగన్ పాలన
ABN, First Publish Date - 2023-08-31T15:06:19+05:30
మోదీ, జగన్‌లు పోటీలు పడి ప్రజలపై భారాలు మోపుతున్నారు. ప్రస్తుతం ఎన్నికలు దగ్గరపడుతున్నాయనే మోదీ రూ. 200 గ్యాస్ ధర తగ్గించారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు గ్యాస్ ధర రూ.450 రూపాయలే ఉంది. ఇప్పుడు రూ.1200 రూపాయలకు పెంచి..
విజయవాడ: విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సమరభేరి నిర్వహించారు. పటమటలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడారు. ‘‘మోదీ (PM MODI), జగన్‌లు (CM Jagan) పోటీలు పడి ప్రజలపై భారాలు మోపుతున్నారు. ప్రస్తుతం ఎన్నికలు దగ్గరపడుతున్నాయనే మోదీ రూ. 200 గ్యాస్ ధర తగ్గించారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు గ్యాస్ ధర రూ.450 రూపాయలే ఉంది. ఇప్పుడు రూ.1200 రూపాయలకు పెంచి.. రూ.200 తగ్గించామని గొప్పలు చెప్పడం హాస్యాస్పదం. సీఎం జగన్ కూడా మోదీ కనుసన్నల్లో పాలన చేస్తున్నారు. స్మార్ట్ మీటర్‌ల పేరుతో అదానీకి లాభాలు చేకూర్చేలా చేస్తున్నారు. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి కాంట్రాక్ట్‌ని ఇచ్చి వేల కోట్లు దోచి పెట్టారు. అధిక ధరల నియంత్రణ, నిరుద్యోగుల సమస్య పరిష్కారానికి సెప్టెంబర్ 4వ తేదీన ఎంఆర్‌ఓ కార్యాలయాల ముందు ధర్నా చేస్తాం.’’ అని వెల్లడించారు.
Updated Date - 2023-08-31T15:06:19+05:30 IST