ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Deputy CM: జనసేన కార్యకర్తలపై డిప్యూటీ సిఎం సంచలన వ్యాఖ్యలు..

ABN, First Publish Date - 2023-07-18T16:06:21+05:30

అమరావతి: శ్రీకాళహస్తి విషయంలో పోలీసులు అతిగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సిఎం కొట్టు సత్యానారాయణ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. జనసేన కార్యకర్తలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: శ్రీకాళహస్తి విషయంలో పోలీసులు అతిగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సిఎం (Deputy CM) కొట్టు సత్యానారాయణ (Kottu Satyanarayana) అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. జనసేన కార్యకర్తలపై (Janasena activists) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ ఏ గొడవ జరిగిన ఎక్కవ శాతం... జనసేన కార్యకర్తలు, అభిమానులే ఉంటున్నారని విమర్శించారు. అయితే తమ వాళ్ళు చాలా డిసిప్లీన్‌తో ఉంటారని, వందే మాతరం పాడితే లేచి నిల్చుంటారని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారన్నారు. సాయంత్రం అయితే ఏ కూడళ్లలో చూసినా జనసేన కార్యకర్తలు ఎలా ఉంటారో గమనించాలన్నారు. వారిని ఎక్కడికక్కడ కంట్రోల్ చేయాలని చూస్తున్నామన్నారు. పవన్ చెప్పేదొకటి చేసేదొకటని.. రోజురోజుకు ఆయన గ్రాఫ్ పడిపోతోందన్నారు. వాలంటీర్ల మీద ఎవ్వరు మాట్లాడించారు, ఎలా మాట్లాడించారు. అతని గ్రాఫ్ ఇమేజ్‌ను తగ్గించడంలో ఓ పథకం ప్రకారం జరుగుతోందన్నారు.

జగన్ (Jagan) నాయకత్వంలో సంక్షేమ పాలన జరుగుతోందని, జగన్ పాలనను అడ్డుకునేందుకు ఒక రాక్షస మూకలాగా తయారవుతన్నారని డిప్యూటీ సిఎం ఆరోపించారు. 2024లో థర్మం గెలవబోతోందని.. ఈ ధర్మం గెలవడం అనేది రాష్ట్రంలో చాలామంది ఎకౌంట్‌లు సెటిల్ అయిపోతాయన్నారు. అయితే పవన్ గ్రాఫ్ పడిపోతే వైకాపా నుంచి నేతలు ఎందుకు జనసేనలో చేరుతున్నారనే మీడియా ప్రశ్నకు డిప్యూటీ సీఎం సమాధానం దాట వేశారు. మేము గేట్లు తెరిస్తే ఎంతో మంది వచ్చేస్తారని.. అయితే తమ నాయకుడు జగన్ దానికి అంగీకరించరని కొట్టు సత్యానారాయణ అన్నారు.

Updated Date - 2023-07-18T16:06:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising