Devineni Uma: ఆర్థిక నేరగాడిని శిక్షించకుంటే సమాజానికి నష్టం..
ABN, First Publish Date - 2023-04-29T14:53:11+05:30
అమరావతి: జగనాసురుడు పది తలల రావణుడని...దరిద్ర పాదం అడుగుపెట్టిన దగ్గర్నుంచి వ్యవసాయం క్లోజ్ అయిందని సీఎం జగన్‌ను ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు విమర్శలు చేశారు.
అమరావతి: జగనాసురుడు పది తలల రావణుడని...దరిద్ర పాదం అడుగుపెట్టిన దగ్గర్నుంచి వ్యవసాయం క్లోజ్ అయిందని సీఎం జగన్ (CM Jagan)ను ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) విమర్శలు చేశారు. శనివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక నేరగాడిని శిక్షించకుంటే సమాజానికి నష్టమని అన్నారు. ఇరిగేషన్ (Irrigation) రంగాన్ని పూర్తిగా నేలమట్టం చేసేశారని, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) నుంచి రూ. వెయ్యి కోట్లు తెచ్చుకుని.. కృష్ణ నదిలో సగం వాటాను తాకట్టు పెట్టారని ఆరోపించారు.
సీఎం జగన్ ఉద్దేశ్యపూర్వకంగానే కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదులను పక్క రాష్ట్రాలకు తాకట్టు పెడుతున్నారని దేవినేని ఉమ విమర్శించారు. గాలేరు నగరి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని గాలికి వదిలేశారని.. ముఖ్యమంత్రికి బాబాయ్ హత్య కేసు.. కోడికత్తి కేసులు వెంటాడుతున్నాయన్నారు. ‘ఇప్పుడేదో జగనన్నకు చెబుదాం.. అంట.. ఈ నాలుగేళ్లు చెప్పలేదా..? జగన్ వినలేదా..?.. సూపర్ స్టార్ రజనీకాంత్‌నే విమర్శించారంటే వాళ్ల పరిస్థితేంటో చూడండి’ అంటూ దేవినేని ఉమమహేశ్వరరావు వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-04-29T14:53:11+05:30 IST