Devineni Uma : పోలీసుల ఆంక్షలు ఛేదించుకుని వినాయకుడి గుడి వద్దకు ఆటోలో దేవినేని ఉమ
ABN, First Publish Date - 2023-09-19T09:48:21+05:30
టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ రావాలంటూ టీడీపీ నేతలు ఎక్కడికక్కడ నేడు పూజలు నిర్వహిస్తున్నారు. విజయవాడలోని వినాయకుడి గుడి వద్ద హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది
విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ రావాలంటూ టీడీపీ నేతలు ఎక్కడికక్కడ నేడు పూజలు నిర్వహిస్తున్నారు. విజయవాడలోని వినాయకుడి గుడి వద్ద హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసుల ఆంక్షలు ఛేదించుకుని వినాయకుడి గుడి వద్దకు దేవినేని ఉమా చేరుకున్నారు. ఎవరికీ కంటపడకుండా ఆటోలో వచ్చి వినాయకుడి దర్శనం చేసుకున్నారు. వచ్చిన వారిని వచ్చినట్టే పోలీసులు అదుపులో తీసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, మాజీ డిప్యూటీ స్పీకర్ వేదవ్యాస్‌తో పాటు పలువురిని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దే ఆపేశారు.
Updated Date - 2023-09-19T09:54:29+05:30 IST