ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Amaravati: విద్యుత్ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి

ABN, First Publish Date - 2023-08-10T16:07:03+05:30

అమరావతి: విద్యుత్ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వంతో జేఏసీ నేతలు చర్చలు జరిపి సంతకాలు పెట్టి రావడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. అంతర్గత వాట్సాప్ గ్రూపుల్లో జేఏసీ నేతలను దూషిస్తూ పోస్టులు పెడుతున్నారు.

అమరావతి: విద్యుత్ ఉద్యోగుల్లో (Electrical Employees) తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వంతో జేఏసీ నేతలు (JAC Leaders) చర్చలు జరిపి సంతకాలు పెట్టి రావడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. అంతర్గత వాట్సాప్ గ్రూపుల్లో (Internal WhatsApp Groups) జేఏసీ నేతలను దూషిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఉద్యోగుల నుంచి వస్తున్న ఒత్తిడి ... రాష్ట్ర జేఏసీ వైఖరికి నిరసనగా గుంటూరు జిల్లా జేఏసీ చైర్మన్ రాజీనామా చేశారు. ఇంజనీర్‌ల సంఘంను చూసి నేర్చుకోండి అంటూ పోస్టులు పెడుతున్నారు. జేఏసీ నేతల ఫోటోలు పెట్టి మరీ దూషిస్తూ ఉద్యోగులు పోస్ట్ చేస్తున్నారు. కిందిస్థాయి ఉద్యోగులతో చర్చించకుండా సంతకాలు ఎలా పెడతారంటూ జేఏసీ నేతలను ఉద్యోగ సంఘాల నేతలు నిలదీస్తున్నారు. ఇంజనీర్‌లు భారీగా నష్టపోతారని చెబుతున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల పొట్ట కొట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. అర్దరాత్రి నుంచి వాట్సాప్ గ్రూపుల్లో జేఏసీ నేతలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.

కాగా పవర్‌ ఎంప్లాయిస్‌ జేఏసీ గొడుగు కింద ఉన్న 26 సంఘాలు ప్రభుత్వంలోని పెద్దలతో సచివాలయంలో బుధవారం నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయని జేఏసీ నేతలు తెలిపారు. సమ్మెకు వెళ్లడం ఖాయమన్న కారణంగా విద్యుత్‌ ఉద్యోగులు సంస్థ ఇచ్చిన సీయూజీ సిమ్‌లను అధికారులకు అప్పగించేశారు. చర్చలు సఫలమైన సమాచారం రావడంతో వాటిని తీసుకోవడానికి రాత్రే కార్యాలయాలకు వెళ్లారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 3వేలమంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో క్షేత్రస్థాయి సిబ్బంది 1500 మంది వరకు ఉంటారు. వారంతా షిఫ్ట్‌ల వారీగా విధులను నిర్వర్తిస్తారు. రాత్రిపూట షిఫ్ట్‌ల్లో ఉండాల్సిన ఉద్యోగులు వర్క్‌ టు రూల్‌ కారణంగా సాయంత్రం ఐదు గంటలకే విధులు ముగించేసుకుంటున్నారు. సమ్మె ఆగిపోవడంతో ఇంటి వద్దే ఉన్న ఉద్యోగులు రాత్రిపూట విధులకు పయనమయ్యారు. విద్యుత్‌ ఉద్యోగుల సమ్మె ఆగిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజానీకం ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడ శివారు ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో రాత్రిపూట విద్యుత్‌ కోతలు తీవ్రంగా ఉంటున్నాయి. సమస్యను సరిచేసే సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది సమ్మెలోకి వెళ్తే ఇంకెన్ని ఇబ్బందులు ఎదురవుతాయోనని ప్రజలు ఆందోళన చెందారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం లేదని తెలియడంతో ఆనందం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-08-10T16:07:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising