ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Perninani: బెజవాడపై పేర్నినాని సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-05-22T12:27:19+05:30

బెజవాడపై మాజీ మంత్రి పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు. బెజవాడ క్రీనీడలో గతమెంతో ఘనమైన ఘనకీర్తి కలిగిన బందరు చరిత్ర మసకబారిందని... ఈ విషయం చెప్పగానే తిరిగి బందరు చరిత్రను తిరిగరాద్దాం అని సీఎం జగన్ అన్నారని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా జిల్లా: బెజవాడపై మాజీ మంత్రి పేర్నినాని (Former Minister Perni Nani) సంచలన వ్యాఖ్యలు చేశారు. బెజవాడ క్రీనీడలో గతమెంతో ఘనమైన ఘనకీర్తి కలిగిన బందరు చరిత్ర మసకబారిందని... ఈ విషయం చెప్పగానే తిరిగి బందరు చరిత్రను తిరిగరాద్దాం అని సీఎం జగన్ (CM Jagan) అన్నారని తెలిపారు. తనకన్నా వయస్సులో జగన్ చిన్నవాడు అయిపోయాడు లేదంటే ఆయనకు పాదాభివందనం చేసేవాడిని అని అన్నారు. నాలుగేళ్ల నుంచి చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu), ఆయన అనుచరులు హైకోర్టు (AP Highcourt), సుప్రీంకోర్టులో (Supreme Court) దావాలు వేసి బందరు పోర్టును ఆపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పనిలోపనిగా మీడియా సమావేశంలో ఆంధ్రజ్యోతిపైనా (ABN - Andhrajyothy) పేర్నినాని అక్కసు వెళ్లగక్కారు. మచిలీపట్నం పోర్టు శంఖుస్థాపన చేస్తున్నారో లేదో అని తెలుగుదేశం నేతలు ఈనో ప్యాకెట్‌లు తెగ తాగేస్తున్నారని యెద్దేవా చేశారు. గతంలో ఏటికేడు మచిలీపట్నంలో ఒక్కో ఆఫీసు మాయం అవుతూ వచ్చాయని... అన్ని బెజవాడకు వెళ్ళిపోయాయన్నారు. జిల్లా విభజన తరువాత తిరిగి బందరు కలెక్టర్ ఆఫీసుకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. అమరావతిలో తనకు, తన వారికి, వేలాది ఎకరాలను అక్రమంగా, అక్రమ సంపాధనతో, నల్లడబ్బుతో చంద్రబాబు తీసుకున్నారని విమర్శించారు. స్టేట్‌లో అక్కడి పోలాలు రేట్లు మాత్రమే పెరగాలి ఎక్కడా పెరగకూడదని ఆయన ఉద్దేశమన్నారు. తమకు ఇన్ని మేలు చేసిన జగన్‌కు చచ్చే వరకూ తాము ప్రేమిస్తామని పేర్నినాని స్పష్టం చేశారు.

Updated Date - 2023-05-22T14:21:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising