Renuka chowdhary: త్వరలో వస్తా.. ఇది ట్రయల్ రన్ మాత్రమే
ABN , First Publish Date - 2023-03-01T15:25:57+05:30 IST
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డికి ఈ సంతానం మూలంగా సుఖం లేకుండా పోయిందని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు.

అమరావతి: ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి (Rajashekar Reddy) కి ఈ సంతానం మూలంగా సుఖం లేకుండా పోయిందని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి (Former Union Minister Renuka Chaudhary) అన్నారు. బుధవారం ఏబీఎన్ (ABN- Andhrajyothy)తో మాట్లాడుతూ.. రాజశేఖర్‌రెడ్డి (YSR)కి ఆత్మశాంతి లేకుండా జగన్ (AP CM Jagan) ఈ పిచ్చివేషాలు వేస్తున్నారని మండిపడ్డారు. జగన్ అప్పుడు కూడా పిచ్చి వేషాలు వేసే వారని.. అయితే తండ్రిగా రాజశేఖర్ రెడ్డి బయటకు రాకుండా కాపాడినట్లు తెలిపారు. ఇక్కడి ప్రజల పరిస్ధితి చూస్తో జాలిపడాలా, కోపం తెచ్చుకోవాలా, అక్రోషం తెచ్చుకోవాలో అర్ధం కావడం లేదన్నారు. బంగారం లాంటి రాష్ట్రం పతనం అయిపోతోందని... సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పులను కూడా సీఎం లెక్కచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఎందుకు సీఎంపై సుమోటోగా యాక్షన్ తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నిజానికి నేడు గుడివాడ వెళ్ళాల్సి ఉందని.. అయితే త్వరలో వస్తా ఇది ట్రయిల్ రన్ మాత్రమే అని రేణుక అన్నారు.
విజయవాడ పార్లమెంటు నుంచి అయినా అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తానని ప్రకటించారు. నందమూరి తారకరామారావు (NTR) కూడా రాజశేఖర్ రెడ్డిని గౌరవించేవారని... వారిరువురికి ఒకరిపై ఒకరికి గౌరవం ఉందని తెలిపారు. వారికి ఆత్మశాంతి లేకుండా ఈ పేర్లు ఇప్పుడు జగన్ మార్చారని అన్నారు. నందమూరి తారకరామారావు పేరు ఉంటే పెరుగుతారని... రాజశేఖర రెడ్డి పేరు పెట్టకపోతే ఆయన తరుగుతారు అనుకుంటే పోరపాటే అని చెప్పుకొచ్చారు. ‘‘ముందు జగన్ నువ్వు ఓ యూనివర్సిటీని తీసుకురా అప్పుడు నీపేరో, తాతపేరో పెట్టుకో’’ అంటూ హితవుపిలికారు. అమరావతి రైతులను ఎంత అడ్డంపడితే అంతగా వారి ఉద్యమం బల పడుతుందన్నారు. ఈ ఉద్యమం ద్వారా రైతు గౌరవాన్ని పెంచారని.... రైతులకు కులం లేదని అన్నారు. ఏ క్షణం అయినా రాజధాని రైతులు పిలిస్తే తాను వస్తానని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు చెప్పినా రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదన్నారు. సుప్రీంకోర్టు ముఖ్యమంత్రిపై యాక్షన్ తీసుకోవాలని లేకపోతే ప్రజలే సహాయనిరాకరణ చేస్తారని హెచ్చరించారు. చంద్రబాబు ఏదో ఒక సైబరాబాద్‌ను తయారు చేశారని.. ఆయన వల్ల అంతో ఇంతో లాభం కలిగిందని చెప్పారు. సీఎం ఇంటి సమీపంలో అంధురాలు ఎస్తేరు రాణి హత్య జరిగిందని... అంతకు ముందు అనేక సంఘటనలు కూడా జరిగాయన్నారు. ఈ రాష్ట్రంలో ఎవరకి రక్షణ ఉంది అని రేణుకా చౌదరి ప్రశ్నించారు.