MP Balasouri అనుచరుడిపై దాడి కేసులో నలుగురి అరెస్ట్

ABN, First Publish Date - 2023-01-30T11:03:13+05:30

వైసీపీ ఎంపీ బాలశౌరి అనుచరుడిపై దాడి కేసులో నలుగురిని అవనిగడ్డ పోలీసులు అరెస్ట్ చేశారు.

MP Balasouri అనుచరుడిపై దాడి కేసులో నలుగురి అరెస్ట్
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: వైసీపీ ఎంపీ బాలశౌరి (YCP MP Balasouri) అనుచరుడిపై దాడి కేసులో నలుగురిని అవనిగడ్డ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అవనిగడ్డ పోలీస్‌స్టేషన్ వద్ద అర్థరాత్రి దాటిన తరువాత హైడ్రామా చోటు చేసుకుంది. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు (MLA Simhadri Ramesh Babu) మేనల్లుడు రేపల్లె దామోదర్ సహా నలుగురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రాత్రి రెండు గంటల సమయంలో నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చారు.

ఇది జరిగింది....

మూడు రోజుల క్రితం నాగాయలంకలో నాబార్డ్ చైర్మన్ షాజీ సమక్షంలో ఎంపీ బాలశౌరి అనుచరుడు గరికపాటి శివపై ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసిన విషయం తెలిసిందే. శివ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా... నలుగురు నిందితులను అలా తీసుకువెళ్లిన పోలీసులు ఇలా స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఎమ్మెల్యే రమేష్ బాబు తనయుడు వికాస్ అందుబాటులోకి లేకుండాపోయారు. తమ అనుచరులను స్టేషన్‌కు తరలించడంపై ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఎమ్మెల్యే వర్గీయులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి హడావిడి చేశారు. మరోవైపు ఈ రోజు మార్కెట్ కమిటీ చైర్మన్ కడవకొల్లు నరసింహారావుకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు.

Updated Date - 2023-01-30T11:03:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising