ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP: విజయవాడలో భవిష్యత్ గ్యారెంటీ చైతన్య యాత్ర

ABN, First Publish Date - 2023-07-09T13:44:12+05:30

విజయవాడ: తెలుగుదేశం పార్టీ చేపట్టిన భవిష్యత్ గ్యారెంటీ చైతన్య యాత్ర ఆదివారం విజయవాడ తూర్పు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. చుట్టుగుంట సెంటర్ నుంచి కృష్ణలంక వరకు చైతన్య యాత్ర కొనసాగునుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: తెలుగుదేశం పార్టీ (TDP) చేపట్టిన భవిష్యత్ గ్యారెంటీ చైతన్య యాత్ర (Future Guarantee Chaitanya Yatra) ఆదివారం విజయవాడ తూర్పు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. చుట్టుగుంట సెంటర్ నుంచి కృష్ణలంక వరకు చైతన్య యాత్ర కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు (TDP Leaders) గద్దె రామ్మోహన్ (Gadde Rammohan), దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao), నెట్టెం రఘురాం (Nettem Raghuram), అశోక్‌బాబు (Ashokbabu) తదితరులు పాల్గొన్నారు.

గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ...

తూర్పు నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి మధ్యలో ఆపేశారని విమర్శించారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి... నాలుగేళ్ల జగన్ విధ్వంసాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లడానికే ఈ చైతన్య యాత్ర చేపట్టినట్లు గద్దె రామ్మోహన్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కేవలం విధ్వంసం నమ్ముకుని ముందుకు వెళ్తున్నారని విమర్శించారు. ‘చంద్రబాబు మార్క్ అభివృద్ధి... జగన్ మార్క్ విధ్వంసం’ అంటూ అభివర్ణించారు. అర్హులైన వారికి కూడా పెన్షన్లు తొలగించిన దిక్కుమాలిన ప్రభుత్వమని దుయ్యబట్టారు. వైకాపా ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల ఆస్తులు ఎలా కూల్చాలన్నది ఆలోచిస్తోందని గద్దె రామ్మోహన్ అన్నారు.

దేవినేని ఉమా మాట్లాడుతూ...

మహానాడులో చంద్రబాబు ప్రకటించిన పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయని, ఎన్టీఆర్ జిల్లాలో భవిష్యత్తు గ్యారెంటీ చైతన్య యాత్రకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని దేవినేని ఉమా అన్నారు. సైకో పాలన అంతం చేయటానికి రాష్ట్ర ప్రజల సిద్ధంగా ఉన్నారని, దసరాకు తెలుగుదేశం ప్రకటించబోయే మేనిఫెస్టోతో వైసీపీ దుకాణం బంద్ అవుతుందని దేవినేని ఉమా అన్నారు.

నెట్టెం రఘురాం మాట్లాడుతూ...

నాలుగున్నర ఏళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ కబంధహస్తాల్లో నలిగిపోతున్నారని, భవిష్యత్ గ్యారంటీ పథకం అన్ని వర్గాలకు మేలుకు చేకూర్చే సంక్షేమ పథకాలు ఉన్నాయని రఘురాం అన్నారు. ఏప్పుడు విముక్తి కలుగుద్దా అని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం తథ్యమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం హయాంలో ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత చంద్రబాబుదని, భవిష్యత్తు గ్యారెంటీ ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నామని నెట్టెం రఘురాం అన్నారు.

Updated Date - 2023-07-09T13:44:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising