Pawan Kalyan: అహింసా మార్గంలో వెళ్లడం ఇప్పుడు సాధ్యం కాదు
ABN, First Publish Date - 2023-10-02T14:06:23+05:30
సినిమా హాల్స్‌లో జాతీయ గీతం ఆలపిస్తే అందరూ లేచి నిలబడాలి. పది లక్షల మంది కలిసి మచిలీపట్నంలో జాతీయ గీతాలపానకు గౌరవిస్తూ నిలబడ్డారు. అవినీతి, దౌర్జన్యంతో నేడు భారతదేశంలో కష్టాన్ని, శ్రమను దోచుకుంటున్నారు. ఈ రాష్ట్ర
కృష్ణాజిల్లా: గాంధీజీ అహింసా, త్యాగాల వల్లే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. మచిలీపట్నంలో ఆయన మౌనదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘బందర్ జాతీయ ఉద్యమానికి పునీతమైన నేల. ఆంధ్రా నేషనల్ కాలేజ్ ప్రత్యేకమైన పరిస్థితిలో పెట్టారు. మనది అని చెప్పేందుకు పెట్టిన కాలేజీ ఇది. దివిసీమ, బందరు ప్రాంతాల్లో గాంధీజీ పర్యటించారు. నేషనల్ కాలేజ్‌ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలోనే మువ్వెన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్య జన్మించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, నోరి దత్తాత్రేయ వంటి ఎందరో ఈ ఆంధ్రా కళాశాలలో చదివారు. నేడు ఈ కళాశాలలో సరైన వసతులు లేవని చెబుతున్నారు. గాంధీ వెళ్లిన ఆ కళాశాలను త్వరలో సందర్శిస్తా. ఈశ్వర్ అల్లాతేరా నామ్ అనేది గాంధీ గారు పెట్టించారు. భక్తి పాటలను ఎవరూ మార్చలేరు. కానీ సనాతన ధర్మం అందరినీ కలిపి తీసుకెళుతుంది. మన దేశ ఔన్నత్యాన్ని పెంచిన గాంధీకి రుణపడి ఉండాలి.’’ అని కోరారు.
‘‘సినిమా హాల్స్‌లో జాతీయ గీతం ఆలపిస్తే అందరూ లేచి నిలబడాలి. పది లక్షల మంది కలిసి మచిలీపట్నంలో జాతీయ గీతాలపానకు గౌరవిస్తూ నిలబడ్డారు. అవినీతి, దౌర్జన్యంతో నేడు భారతదేశంలో కష్టాన్ని, శ్రమను దోచుకుంటున్నారు. ఈ రాష్ట్ర సీఎం దోచుకుని విదేశాలకు తరలించారు. ఈ దోపిడీ, అవినీతి అడ్డుకట్ట వేయాలి. 2024 ఎన్నికల తర్వాత మన ప్రభుత్వం వచ్చాక గాంధీ జయంతిని బందరులో చేసుకుందాం. గాంధీజీకి, అంబేద్కర్ మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయి. వారు మన సీఎం లాగా కాకుండా బాధ్యతతో ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి (Cm jagan) లాగా కేసులు పెట్టి, జైళ్లకు పంపే ఆలోచన వారు చేయలేదు. రాజకీయాల్లో అభిప్రాయ బేధాలు ఉండటం సహజం. అంబేద్కర్ మేధస్సును గుర్తించి గాంధీజీ అవకాశం ఇచ్చారు. దేశ అవసరాల కోసం ఎవరితో అయినా కలిసే స్వేచ్ఛ ఉంది. జగన్‌పై నాకు వ్యక్తిగత ద్వేషం లేదు. ఆయన ఆలోచన, పాలన నిర్ణయాలను వ్యతిరేకించా. గ్రామ స్వరాజ్యాన్ని ఈ ప్రభుత్వం చంపేశారు. గాంధీ అహింసా మార్గంలో వెళదామన్నా ఇప్పుడు నాయకులతో సాధ్యం కాదు. మన సమకాలీన రాజకీయ నాయకులకు బ్రిటిష్ వాళ్లకు ఉన్న సంయమనం లేదు. మన నల్ల నాయకుల కన్నా తెల్లవాళ్లే కొంచెం ఆలోచించే వాళ్లు. అందుకే ప్రజల కోసం, రాష్ట్ర హితం కోసం కలిసి పోరాడాలి. వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి. బురదలో నుంచి కమలం వచ్చినట్లు... కలుషితమైన రాజకీయాల్లో నుంచి జనసేన కమలం వికసిస్తుంది. రాజకీయాల్లో బురద పడుతుందని తెలుసు.. అయినా ముందుకే సాగుతాం.’’ అని పవన్ పేర్కొన్నారు.
Updated Date - 2023-10-02T14:06:23+05:30 IST