Janasena: ‘పవన్ ఏం మాట్లాడాడో తెలుసుకో’.. పేర్నినానిపై పోతిన ఫైర్
ABN, First Publish Date - 2023-04-18T12:14:30+05:30
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
విజయవాడ: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan)పై ఏపీ మంత్రి పేర్ని నాని (AP Minister Perninani) చేసిన వ్యాఖ్యలపై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ (Jana Sena State Spokesperson Pothina Venkata Mahesh) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేర్ని నానికి పిచ్చి బాగా ముదిరిందని... అజ్ఞానం ఎక్కువైందని మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను గుడ్డిగా చదివారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడో ముందు తెలుసుకో నాని అని హితవుపలికారు. ప్రజలను కించ పరచవద్దని పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) చాలా సందర్భాలలో చెప్పారని... నాయకులు తప్పుగా మాట్లాడితే పవన్ (Janasena Chief) ఖండించారన్నారు. వైసీపీ నాయకులు తెలంగాణ (Telangana ) ప్రజలను కించ పరుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నాయకులు మాట్లాడే వాటిని వక్రీకరించారు.. మరి మంత్రి సిదిరి అప్పలరాజు (Minister Sidiri Appalaraju) మాట్లాడిన మాటలు పాలేరు పేర్ని నానికి వినపడలేదా అని నిలదీశారు. హరీష్ రావు (Telangana Minister Harish Rao) మాట్లాడిన మాటలకు జగన్‌కు, మంత్రులకు పౌరుషం రావడంలేదా అని అన్నారు. ఏపీలో అవకాశాలు లేవని చెబితే జగన్ (AP CM)కు సిగ్గు అనిపించడం లేదా అంటూ మండిపడ్డారు. పేర్ని నాని, అప్పలరాజు, బొత్స (Minister Botsa Satyanarayana), కారుమూరి (Karumuri Nageshwar Rao) వంటివారు నోరు విప్పరా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ (BRS)పై విమర్శలు చేస్తే లోటస్ పాండ్ కూలిపోతుందనే భయమా... లేక తమ వ్యాపారాలు హైదరాబాద్‌లో ఉండవనా అని అడిగారు. ‘‘పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ను వక్రీకరిస్తారా.. మీకు దమ్ముంటే హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వండి’’ అంటూ జనసేన నేత వ్యాఖ్యానించారు.
తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తున్న షర్మిల (YSRTP Chief YS Sharmila) అప్పలరాజు వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ‘‘మీరు మాట్లాడకపోతే అన్నా చెల్లెల్లు డ్రామా అనుకోవాల్సి వస్తుంది’’ అని అన్నారు. ‘‘పెద్దిరెడ్డి, బుగ్గన, మిథున్ రెడ్డికి ధైర్యం ఉంటే తెలంగాణ ప్రెస్ క్లబ్‌కు వెళ్లి మాట్లాడాలి. మీరు ఆ ప్రెస్ క్లబ్ నుంచి బయటకి రాగలరా. సీఎం తన వర్గం సేఫ్ చూసుకుని, ఇతర వర్గాలను ఉసి గొల్పుతున్నాడు. కాపు, బిసి, దళిత మంత్రులే ఎదుటి వారిని తిట్టాలా. జగన్, అతని సామాజిక వర్గం మంత్రులకు నోళ్లు లేవా. మీరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖాయం’’ అని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఇస్లాం విద్య, ధార్మిక సంస్థలకు రూ.25 లక్షల విరాళం ప్రకటించారన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మదరాసీలకు ఐదు లక్షలు విరాళంగా ఇచ్చారని తెలిపారు. తాను కష్టపడిన సొమ్మును ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఇస్తున్నారన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి దోచుకో, దాచుకో అనే విధానంతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రెండువేల మంది ముస్లీం పేద కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేస్తామని పోతిన వెంకట మహేష్ ప్రకటించారు.
Updated Date - 2023-04-18T12:38:08+05:30 IST