ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kanti Rana Tata: శ్యామ్ కుమార్‌పై దాడి కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశాం

ABN, First Publish Date - 2023-11-04T22:01:55+05:30

కంచికచర్ల దళిత యువకుడు శ్యామ్ కుమార్‌పై దాడి కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశామని ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ( Kanti Rana Tata ) తెలిపారు.

విజయవాడ: కంచికచర్ల దళిత యువకుడు శ్యామ్ కుమార్‌పై దాడి కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశామని ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ( Kanti Rana Tata ) తెలిపారు. శనివారం నాడు కమిషనర్ కాంతి రాణా మీడియాతో మాట్లాడుతూ..‘‘కాలేజ్ చదువుకునే రోజుల్లో ఉన్న పాత కక్షలే ఈ దాడికి కారణం. దళిత యువకుడిపై దాడి చేసినవారంతా కూడా ప్రకాశం జిల్లా, గణపవరంకు చెందిన హరీష్‌రెడ్డి, అతని స్నేహితులే. కంచికచర్లలో ఇంజనీరింగ్ కాలేజీలో సర్టిఫికెట్స్ తీసుకొని శ్యామ్ కుమార్‌ని పని ఉందంటూ పిలిపించి కారులో ఎక్కించుకొని యువకుడిని తిప్పుతూ కొట్టారు. నిందితులపై కిడ్నాప్ , ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌తో పాటు, 363, 323, 326, 386, R/W 34ఐపీసీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశాం. ఈ సెక్షన్స్ కింద 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసుతో పాటు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ నమోదు చేశాం. 307 వర్తించదు కాబట్టి ఆ సెక్షన్ నమోదు చేయలేదు. నిందితులను ఈరోజు కోర్టులో ప్రవేశపెడతాం’’ అని కాంతిరాణాటాటా తెలిపారు.

Updated Date - 2023-11-04T22:01:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising