Kotamreddy: ఏపీ అసెంబ్లీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెరైటీ నిరసన
ABN, First Publish Date - 2023-03-15T09:55:21+05:30
ప్రభుత్వంపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన కొనసాగుతూనే ఉంది.
అమరావతి: ప్రభుత్వంపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (YCP rebel MLA Kotamreddy Sridhar Reddy) నిరసన కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏపీ అసెంబ్లీలో (AP Assebly Budget Session) నూ ప్రభుత్వం (YCP government)పై వ్యతిరేకత ప్రదర్శించారు. బుధవారం ఉదయం సభ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Sitharam) ప్రశ్నోత్తరాలను చేపట్టారు. స్పీకర్ ప్రశ్నోత్తరాలను ప్రస్తావించిన వెంటనే నియోజక సమస్యలను ప్రస్తావిస్తూ కోటంరెడ్డి ప్లకార్డుతో సభలో నిలబడ్డారు. దీంతో క్వశ్చన్ అవర్‌లో మెంబర్ మధ్యలో మాట్లాడకూడదని స్పీకర్ తెలిపారు. ‘‘శ్రీధర్ రెడ్డి మీరు ప్రభుత్వానికి సమస్యలు చెప్పుకోవాలంటే నేను గవర్నమెంట్‌కు తెలియజేస్తాను. మీరు చేస్తున్న ప్రొటెస్ట్‌ను హౌస్, నేను కూడా గుర్తించాం. మీరు కంటిన్యూగా ఇలా చేయడం తగదు. మీరు కుర్చుంటే ప్రభుత్వం స్పందిస్తుంది’’ అని స్పీకర్ తమ్మినేని తెలిపారు.
బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి (Buggan Rajendranath Reddy) స్పందిస్తూ... సమస్యలు లేని సోసైటీ ఉండదని.. సమస్యలను ఏ వేదికలో తీర్చుకోవాలనేది చూడాలన్నారు. గవర్నర్ ప్రసంగం జరగాల్సిన సమయంలో వ్యక్తిగత అంశాలు అడగడం సమంజసం కాదని తెలిపారు. కోటంరెడ్డి ఇబ్బందులను రిప్రజెంట్ చేస్తే తాము స్పందిస్తామన్నారు.
మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) మట్లాడుతూ.. శ్రీధర్ రెడ్డి కావాలనే రగడ చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఆయన హౌస్‌ను ఇబ్బందిపెట్టి ప్రజల దృష్టిలో పడాలని చూస్తున్నారన్నారు. టీడీపీ సభ్యులకు తెల్లారే సరికి శ్రీధర్ రెడ్డిపై ప్రేమ వచ్చేసిందే అంటూ యెద్దేవా చేశారు. శ్రీధర్ రెడ్డి ఇక్కడకు వచ్చి తెలుగుదేశంతో చేతులు కలిపి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ‘‘శ్రీధర్ రెడ్డి నమ్మక ద్రోహి అని... శ్రీధర్ రెడ్డిని క్షమించొద్ద అని, అవకాశం ఇవ్వద్దు అవసరం అయితే చర్యలు తీసుకోండి’’ అంటూ స్పీకర్‌కు మంత్రి అంబటి వినతి చేశారు.
మైక్ ఇచ్చే వరకూ...
అంతకుముందు.... సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద కోటంరెడ్డి నిరసన తెలిపారు. తన నియోజకవర్గంలోని సమస్యల ప్ల కార్డులను ప్రదర్శిస్తూ అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన అంతరాత్మ ప్రభోదానుసారమే ఓటు వేస్తానని తెలిపారు. వైసీపీ ఇతర ఎమ్మెల్యేలు కూడా వారి వారి అంతరాత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తారని భావిస్తున్నా నన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి తన నిరసన కొనసాగుతుందన్నారు. సమస్యలను పరిస్కరిస్తే తానే ముఖ్యమంత్రిని అభినందిస్తానన్నారు. 4 ఏళ్ళు సమస్యల పరిష్కారం కోసం తిరిగి తిరిగి విసిగిపోయే గళం వినిపిస్తున్నానన్నారు. మైకు ఇచ్చే వరకూ అసెంబ్లీలో మైక్ అడుగుతూనే ఉంటానన్నారు. మైక్ ఇవ్వకుంటే తన నిరసన ప్లకార్డుల రూపేణా నిలబడి ప్రదర్శిస్తూనే ఉంటానన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పచ్చ కండువా కప్పి రాజధాని రైతులు మద్దతు తెలిపారు. ప్లకార్డు ప్రదర్శన వద్దంటూ కోటంరెడ్డిని పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వెళ్లే తనని అడ్డుకునే హక్కు పోలీసులకు లేదంటూ ప్లకార్డు ప్రదర్శనతోనే అసెంబ్లీకి కోటంరెడ్డి వెళ్లారు.
Updated Date - 2023-03-15T09:59:02+05:30 IST