నేటి నుంచి మేరీ లైఫ్‌ మేరా స్వచ్ఛ్‌ షెహర్‌ కార్యక్రమం

ABN , First Publish Date - 2023-05-20T00:38:04+05:30 IST

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని(జూన్‌ 5న) పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ ఆదేశాల మేరకు మేరీ లైఫ్‌-మేరా స్వచ్ఛ్‌ షహర్‌ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నగర అదనపు కమిషనర్‌ (ప్రాజెక్ట్స్‌) కేవీ సత్యవతి అన్నారు.

నేటి నుంచి మేరీ లైఫ్‌ మేరా స్వచ్ఛ్‌ షెహర్‌ కార్యక్రమం

నేటి నుంచి మేరీ లైఫ్‌ మేరా స్వచ్ఛ్‌ షెహర్‌ కార్యక్రమం

చిట్టినగర్‌, మే 19 : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని(జూన్‌ 5న) పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ ఆదేశాల మేరకు మేరీ లైఫ్‌-మేరా స్వచ్ఛ్‌ షహర్‌ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నగర అదనపు కమిషనర్‌ (ప్రాజెక్ట్స్‌) కేవీ సత్యవతి అన్నారు. ఈ మేరకు శుక్రవారం కెనాల్‌ రోడ్డు, స్క్యూ బ్రిడ్జి, నగరంలోని 64 వార్డులలో స్వచ్ఛంద సంస్థలు, అపార్ట్‌మెంట్‌వాసులు, స్కూళ్లు కాలేజీ స్టూడెంట్స్‌, రెస్టారెంట్ల నిర్వాహకులతో కలిసి అవగాహన కార్య క్రమాలు చేపట్టారు. ఈ సందర్భంలో సత్య వతి మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి జూన్‌ 5 వరకు నగరంలోని 64 వార్డులలో 15 రోజుల పాటు మేరీ లైఫ్‌-మేరా స్వచ్ఛ షహర్‌ అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంలో చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పి. రత్నావళి మాట్లాడుతూ స్వచ్ఛభారత్‌ మిషన్‌ వారు చేపట్టిన త్రిపుల్‌ ఆర్‌ ప్రక్రియకు ప్రజలను భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా ఉపయోగపడే పాత దుస్తులు, బొమ్మలు, ప్లాస్టిక్‌ పుస్తకాలు, ఇతర వస్తువులను సేకరిస్తున్నట్లు తెలిపారు. పాత వస్తువుల సేకరణ కోసం నగరంలోని 64 వార్డులలోని ముఖ్య ప్రాంతాల్లో 67 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. హెల్త్‌ ఆఫీసర్లు, శానిటరీ సూపర్‌వైజర్లు, ఇన్‌స్పెక్టర్లు, సెక్రటరీలు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-20T00:38:04+05:30 IST