Minister Satyanarayana: దుర్గమ్మ కొండపై దసరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం
ABN, First Publish Date - 2023-10-14T17:41:02+05:30
ఇంద్రకీలాద్రిపై దసరా పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నామని దేవాదాయ శాఖామంత్రి కొట్టు సత్యనారాయణ(Minister Kottu Satyanarayana)వ్యాఖ్యానించారు.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నామని దేవాదాయ శాఖామంత్రి కొట్టు సత్యనారాయణ(Minister Kottu Satyanarayana)వ్యాఖ్యానించారు. శనివారం నాడు దుర్గమ్మ కొండపై దసరా ఏర్పాట్లును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ..‘‘ప్రణాళిక ప్రకారం అన్ని ఏర్పాట్లు జరిగాయి. కేశఖండన చేసుకున్న వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ఇటీవల కొండచరియలు విరిగిపడిన దగ్గర తగు జాగ్రత్తలు తీసుకున్నాం. సబ్ కలెక్టర్ కార్యాలయం, వీఎంసీలో ఒక టికెట్ కౌంటర్ పెట్టాం. పండుగ సందర్భంగా 3500 మంది పోలీసులు కొండపై బందోబస్తు చేస్తున్నారు. ప్రోటోకాల్ వీవీఐపీలకు మాత్రమే అంతరాలయ దర్శనం ఉంటుంది. పాలు, మజ్జిగ, బిస్కెట్లు క్యూలైన్లలో ఏర్పాటు చేస్తాం. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పండుగ రోజు అమ్మవారిని దర్శించుకుంటారు. సీఎం రాకకు ప్రత్యేక ఏర్పాటు చేశాం. బీఎస్ఎన్ఎల్, ఫైబర్‌నెట్, ఏక్ట్ నుంచి కనెక్షన్లు దసరాకు తీసుకున్నాం. కొండచరియలు విరిగిపడకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. వృద్ధులకు దర్శనం కోసం ఉదయం, సాయంత్రం వెళల్లో రెండు స్లాట్లు ఉంటాయి. సేవాసమితుల ఆధ్వర్యంలో వృద్ధులకు సేవలు చేస్తారు’’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.
విజయదశమి అందరికీ మంచి చేస్తుంది: వెలంపల్లి శ్రీనివాసరావు
దసరా పండుగకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగాయని వైసీపీ పార్టీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు(Velampally Srinivasa Rao) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేశాం. విజయదశమి అందరికీ మంచి చేస్తుందని వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
Updated Date - 2023-10-14T17:41:02+05:30 IST