ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Kottu: శ్రీ లక్ష్మీ మహాయజ్ఞానికి మంచి ఆదరణ

ABN, First Publish Date - 2023-05-13T13:48:10+05:30

నగరంలో ప్రభుత్వం చేపట్టిన శ్రీ లక్ష్మీ మహాయజ్ఞనికి మంచి ఆదరణ వస్తుందని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నగరంలో ప్రభుత్వం చేపట్టిన శ్రీ లక్ష్మీ మహాయజ్ఞానికి మంచి ఆదరణ వస్తోందని మంత్రి కొట్టు సత్యనారాయణ (Minister kottu Satyanarayana) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... చరిత్రలో ఎవరు చేయలేని యజ్ఞాన్ని ప్రభుత్వం తలపెట్టిందని తెలిపారు. వేలాదిమంది భక్తులు యజ్ఞంలో పాల్గొంటున్నారన్నారు. భక్తులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో యజ్ఞాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని.. అన్ని శాఖల సమన్వయంతో యజ్ఞo జరుగుతుందని చెప్పారు. మొదటి యాగశాలలో పాంచరాత్రం ఆగమనంలో రిత్వికులు పవిత్రంగా యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారన్నారు. నాలుగు ఆగమనాలకు సంబంధించి.. అత్యుత్తమైన యాగాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. తమిళనాడు రిత్వికులు కూడా యజ్ఞంలో పాల్గొన్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు మంచి జరగాలని యజ్ఞాన్ని తలపెట్టామన్నారు. సీఎం జగన్ మొదటిరోజు సంకల్పం తీసుకున్నారని... ఆఖరి రోజు పూర్ణాహుతిలో యజ్ఞఫలాన్ని సీఎం జగన్‌కు దారబోస్తారని అన్నారు. సీఎం జగన్ ఈ యజ్ఞఫలాన్ని ప్రజలకు అందిస్తారని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.

Updated Date - 2023-05-13T13:48:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising