Raghurama: 5 నిమిషాల్లో కొట్టేయాల్సిన కేసు 5 నెలలు పెండింగ్‌లో ఉంది..
ABN, First Publish Date - 2023-05-13T14:29:30+05:30
జగన్ ప్రభుత్వం (Jagan Govt.) తీసుకువచ్చిన జీవో నంబర్ 1 (GO No.1)పై హైకోర్టు (High Court) చెప్పు తీసుకొని కొట్టినట్టు ఉందని నరసాపురం ఎంపీ రఘురామరాజు (Raghurama Krishnamraju) అన్నారు.
ఢిల్లీ: జగన్ ప్రభుత్వం (Jagan Govt.) తీసుకువచ్చిన జీవో నంబర్ 1 (GO No.1)పై హైకోర్టు (High Court) చెప్పు తీసుకొని కొట్టినట్టు ఉందని నరసాపురం ఎంపీ రఘురామరాజు (Raghurama Krishnamraju) అన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. జీవో నెం.1 ప్రజల ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమన్నారు. 5 నిమిషాల్లో కొట్టేయాల్సిన కేసు 5 నెలలు పెండింగ్‌లో ఉందని.. ఇప్పటికైనా ఆర్డర్ రావడం చాలా సంతోషమన్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు (Supreme Court) వచ్చి ఉంటే బాగుండునని అన్నారు.
రుషికొండపై ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) తాత్కాలికంగా మకం పెట్టేలోగ ఏదైనా ఆర్డర్ ఇస్తారో చూడాలని రఘురామ అన్నారు. తనను చిత్ర హింసలకు గురి చేసి ఆదివారం నాటికి ఏదాది పూర్తి అవుతుందన్నారు. కస్టోడియల్ టాచ్చర్ (Custodial Thatcher)పై శుక్రవారం హైకోర్టులో విచారణకు వచ్చిందని, సీబీఐ (CBI)కు కూడా కాల్ డేటా స్టోర్ చేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. నిన్న ఒక పోలీసు బీజేపీ కార్యకర్తను (BJP Activist) కాళ్ళ మధ్యలో వేసి తొక్కుతున్నారని, దీనిపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు (JP Nadda) లేఖ రాశారన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఇంతటి విజయాన్ని సాధించి పెట్టిన జగన్‌కు కాంగ్రెస్ కృతజ్ఞతలు చెప్పాలని రఘురామ అన్నారు. తెలుగు వారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఓడిపోయిందని, తెలుగు వారికి జగన్‌పై ఉన్న కోపంతో బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారన్నారు. జగన్‌ను బీజేపీ కాపాడుతుందని తెలుగు ప్రజలు అనుకొని ఉంటారని.. అందుకే బీజేపీ పెద్దలకు విజ్ఞప్తి.. దుష్టులకు దూరంగా ఉండాలని రఘురామ సూచించారు.
Updated Date - 2023-05-13T14:30:11+05:30 IST