ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raghurama: రెండేళ్ల తర్వాత ఏపీ హైకోర్టు నాకు న్యాయం చేసింది...

ABN, First Publish Date - 2023-02-09T13:50:54+05:30

రెండేళ్ల క్రితం సీఎం జగన్ (CM Jagan) డైరెక్షన్‌లో పోలీసులు తనను దారుణంగా హింసించారని, వారికి ఇప్పుడు హై కోర్టు (High Court) నోటీసులు (Notice) ఇచ్చిందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: రెండేళ్ల క్రితం సీఎం జగన్ (CM Jagan) డైరెక్షన్‌లో పోలీసులు తనను దారుణంగా హింసించారని, వారికి ఇప్పుడు హై కోర్టు (High Court) నోటీసులు (Notice) ఇచ్చిందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama) అన్నారు. గురువారం ఆయన

ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రెండేళ్ల తర్వాత ఏపీ హైకోర్టు తనకు న్యాయం చేసిందని సంతోషం వ్యక్తం చేశారు. నా ప్రాణాలకు ప్రతిపక్ష నేతలు అండగా ఉన్నారని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

సునీల్ కుమార్ (Sunil Kumar) అమెరికా (America)లో ఉన్నారని, గొల్ఫ్స్ ఆడుకుంటున్నారుని రాఘురామ అన్నారు. నాలుగేళ్లు సైలెంట్‌గా ఉన్న ప్రభుత్వం ఇప్పుడు షాధి ముబరక్ (Shadi Mubarak) సహాయం అంటోందని, అంతకు ముందు పెళ్లి చేసుకున్నవారికి కనుక ఇవ్వరంటా.. అంటూ విమర్శలు చేశారు. 6వ తరగతి చదివిన వారికి మంత్రి పదవి ఇవ్వొచ్చు.. కానీ... ప్రభుత్వ పథకాలు తీసుకోవాలంటే 10వ తరగతి పాస్ అవ్వాలా? ఏంటి ఇది అంటూ విమర్శించారు.

ఏపీ రాజధాని విషయంలో సీఎం జగన్ (CM Jagan) ఆశలపై కేంద్రం నీళ్లు చల్లినట్టేనని రఘురామ అన్నారు. ముఖ్యమంత్రి విశాఖకు వెళ్తే వెళ్లొచ్చు... అవసరం లేని వారు కోటలో ఉన్న పేటలో ఉన్న ఒకటేనన్నారు. నిన్న పార్లమెంట్‌ (Parliament)లో విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) అడిగిన ప్రశ్నకు కేంద్రం అమరావతే ఏపీ రాజధాని అంటూ సమాధానం ఇచ్చిందన్నారు. ప్రశ్న అడిగిన సాయిరెడ్డికి అభినందనలు తెలుపుతున్నానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు అంటే హైకోర్టు కేసును కెట్టేసిందన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం జరిగిందని.. మళ్ళీ రాజధాని చేయాలంటే పార్లమెంట్‌లో చట్టం చేయాలని రఘురామ అన్నారు.

Updated Date - 2023-02-09T13:51:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising