Raghurama: నాలాగే ఆయన మాయగాడి వలలో పడ్డారు
ABN, First Publish Date - 2023-07-31T14:32:50+05:30
న్యూఢిల్లీ: ఏపీ మాజీ సీఎస్ అజయ్ కల్లం మంచి వ్యక్తి అని రాష్ట్రానికి ఎనలేని సేవ చేశారని, ఆయన అవినీతి మరకలేని వ్యక్తి అని, తనలాగే ఒక మాయగాడీ వలలో పడ్డారని ఎంపీ రఘురమకృష్ణంరాజు అన్నారు.
న్యూఢిల్లీ: ఏపీ మాజీ సీఎస్ అజయ్ కల్లం (Ajay Kallam) మంచి వ్యక్తి అని రాష్ట్రానికి ఎనలేని సేవ చేశారని, ఆయన అవినీతి మరకలేని వ్యక్తి అని, తనలాగే ఒక మాయగాడి వలలో పడ్డారని ఎంపీ రఘురమకృష్ణంరాజు (MP Raghurama Krishnamraju) అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అజయ్ కల్లం మొదట సీబీఐ (CBI)కు స్టేట్‌మెంట్ ఇచ్చారని, ఆ రోజు ఉదయం 6.30 గంటలని వైసీపీ (YCP) వాళ్ళు కొత్త టైం తీసుకొచ్చారన్నారు. సుప్రీంకోర్టు (Supreme Court)లో సీబీఐ అధికారులు ఇచ్చే ఆధారాల్లో మార్పు ఉండదని, ఆ డైరీ వేరు ఈ డైరీ వేరని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ప్రత్యేక హోదా (Special Status) కోసం ఢిల్లీ వచ్చిన ఫలితం ఉండదన్నారు.
విశాఖపట్నంలో పెద్ద కుంభకోణం జరిగిందని, జేఎంఆర్ బ్రాండ్‌తో రూ. 1250 సెల్ఫ్ హెల్ప్ పేరిట కట్టాలని జే. మల్లేశ్వర రావు అనే వ్యక్తి వసూల్ చేస్తున్నారని రఘురామ ఆరోపించారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అందరూ.. అసలు జేఎంఆర్ ఏంటి అని కనుక్కున్నారని తెలిసిందన్నారు. సీఎం ఆఫీస్ నుంచి ఏమైనా డైరెక్షన్ వచ్చిందా? అనే అనుమానాన్ని రఘురామ వ్యక్తం చేశారు.
Updated Date - 2023-07-31T14:32:50+05:30 IST