MP Raghurama: ఇంత ఎర్రిపప్పలా దొరికేస్తారని అనుకోలేదు..
ABN, First Publish Date - 2023-07-24T15:29:27+05:30
న్యూఢిల్లీ: ఎంపీ అవినాష్ రెడ్డి జూన్ 19వ తేదీన సీబీఐకు లేఖ రాశారు అంటా.. ఇంతకు ఆయనే 95 పేజీల లేఖ రాశారా? అని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) జూన్ 19వ తేదీన సీబీఐ (CBI)కు లేఖ (Letter) రాశారు అంటా.. ఇంతకు ఆయనే 95 పేజీల లేఖ రాశారా? అని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) ప్రశ్నించారు. సోమవారం ఆయన ఢిల్లీ (Delhi)లో మీడియాతో మాట్లాడుతూ సిగ్గు లజ్జ లేకుండా అందులో రాశారని, హత్య జరిగిన రాత్రి అవినాష్ రెడ్డి అందరితో ఉదయం 5 గంటల వరకు ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నారన్నారు. గంగిరెడ్డి ఫోన్ నుంచి అవినాష్ రెడ్డి ఫోన్‌కు ఎందుకు అన్ని సార్లు వెళ్ళిందని నిలదీశారు.. అజయ్ కల్లం ఒక టైం చెప్పారు.. ఉమారెడ్డి టైం గుర్తు లేదని అన్నారు.. వివేకా హత్య (Viveka Murder) జరిగిన రాత్రి రెండు గంటలకు కూడా అవినాష్ ఫోన్ మాట్లాడారన్నారు. భారతి (Bharathi) కూడా హడావుడిగా సునీత (Sunitha)ను కలిసారని, దీనిపై సునీత స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారన్నారు. ఇంత ఎర్రిపప్పల దొరికేస్తారాని అనుకోలేదన్నారు. సీబీఐ ఛార్జిషీట్‌ను అవినాష్ రెడ్డి తప్పుపట్టడం ఏంటన్నారు. సునీత స్టేట్మెంట్ చాలా క్లియర్‌గా ఉందని, అడ్డంగా దొరికారని, త్వరలో మరికొంతమంది పేర్లు వస్తాయన్నారు.
బైజూస్ (Byjus)కు ఏ విధంగా టెండర్లు ఇచ్చారని రఘురామ ప్రశ్నించారు. ఏడాదికి మాత్రమే కంటెంట్ ఉచితంగా ఇస్తామని బై జూస్ ఒప్పందం చేసుకుందని, పిల్లలకు మళ్ళీ కొత్త ట్యాబ్ ఇస్తారా? అని అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ పాఠం చెపితే పవన్ కళ్యాణ్‌కు అర్ధం అవుతుందా? అన్నారు. జూన్ నెలలో బై జూస్ నుంచి చాలా మంది డైరెక్టర్స్ రాజీనామా చేశారని, బ్యాలన్స్ షీట్ ఇవ్వడం లేదని, ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వడం లేదని రఘురామ విమర్శించారు. తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో వెళ్లి మరీ జగన్ చెట్లు నాటారని, 5 కిలో మీటర్లు దూరానికి కూడా హెలికాప్టర్‌లో వెళ్లిన ప్రజా నాయకుడిని ఇప్పటి వరకు చూడలేదన్నారు.
చెట్లు నాటిన జగన్ (Jagan)కు విజ్ఞప్తి.. చెట్లు నరికేయడం ఆపేయాలని రఘురామ కోరారు. అమరావతిపై అభినవ అసురుడు దాడి చేస్తున్నారని, మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేస్తారు కాబట్టి అక్కడ ఇంటికి 5 వందల దొంగ ఓట్లు నమోదు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వైసీపీ పార్టీపై తిరుగుబాటు మొదలైందని, పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు హ్యాట్సాఫ్.. ఆయనకు కానీ, ఆయన కుమారుడికి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని పులిలా చెప్పారని రఘురామ అన్నారు.
Updated Date - 2023-07-24T15:37:20+05:30 IST