Raghurama: బాబాయ్‌ని హత్య చేసిన వ్యక్తి బయట.. కోడికత్తి శ్రీను జైల్లో..
ABN, First Publish Date - 2023-08-02T16:02:03+05:30
న్యూఢిల్లీ: కోడికత్తి శ్రీను పాపం జైల్లో ఉన్నాడని, బాబాయ్ వివేకను హత్య చేసిన వ్యక్తి బయట ఉన్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
న్యూఢిల్లీ: కోడికత్తి శ్రీను (Kodikatti Srinu) పాపం జైల్లో ఉన్నాడని, బాబాయ్ వివేకను హత్య (Viveka Murder) చేసిన వ్యక్తి బయట ఉన్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghuramakrishnamraju) అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఢిల్లీ (Delhi)లో మీడియాతో మాట్లాడుతూ నాలుగేళ్లుగా కోడి కత్తి శ్రీను జైల్లో ఉన్నాడని, పొడిపించుకున్నవారు కోర్టుకు వెళ్ళారని, జగన్మోహన్ రెడ్డి (Jaganmohanreddy), శ్రీను కలిసి అనుకున్నారా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. కోడికత్తి శ్రీను జీవితం కూడా మొద్దు శ్రీను జీవితంలా అవుతుందేమో తెలియదన్నారు. జైల్లో కూడా ఎవరో బిహారీ అతను ఉన్నాడని అంటున్నారని రఘురామ అన్నారు.
వాలంటీర్ల కిరాతకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, మొన్న విశాఖలో ఓ వాలంటీర్ మహిళను హత్య చేశాడని, నిన్న మరో వాలంటీర్ వివాహితను తీసుకెళ్ళాడని రఘురామ అన్నారు. వాలంటీర్‌లు స్వేచ్ఛగా ఎవరి ఇంటికి పడితే వారి ఇంటికి వెళ్ళే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. దీనికి సీఎం జగన్ బాధ్యత వహించాల్సిందేనన్నారు. ఎంత సేపు ఓట్లు కొనుగోలు కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నారని, వాలంటీర్‌లు బియ్యం ఇవ్వడం కోసం వచ్చి డబ్బులు కావాలా? బియ్యం కావాలా? అని అడుగుతున్నారని, ఒంగోలులో ఒక వాలంటీర్ తమ్ముడు ఆన్న వేలిముద్రను తయారు చేసి ముద్ర వేస్తున్నారన్నారు. అసలు వాలంటీర్ బెంగుళూరులో ఉంటున్నాడన్నారు. సోషల్ మీడియాలో వాలంటీర్ వ్యవస్థపై జోకులు వేస్తున్నారని, ఈ వ్యవస్థపై ఒక్కసారి ఆలోచించాలన్నారు. పులివెందులలో ఇవాళ చంద్రబాబు నాయుడు బహిరంగ సభ ఉందని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. బహిరంగ సభ హిట్ అవుతుందన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఎల్లుండి నుంచి జనసేన యాత్ర ఉంటుందని రఘురామ పేర్కొన్నారు.
Updated Date - 2023-08-02T16:02:03+05:30 IST