Raghurama: లోకేష్ నడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి కాళ్లకు నొప్పి
ABN, First Publish Date - 2023-08-22T15:40:05+05:30
న్యూఢిల్లీ: గన్నవరంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రకు పెద్ద స్పందన వచ్చిందని, వేలమంది ప్రజలు అర్ధరాత్రి దాటిన రోడ్లపైనే ఉన్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.
న్యూఢిల్లీ: గన్నవరంలో నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)కు పెద్ద స్పందన వచ్చిందని, వేలమంది ప్రజలు అర్ధరాత్రి దాటినా రోడ్లపైనే ఉన్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghuramakrishnamraju) అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ గన్నవరంలో లోకేష్ నడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి (Jaganmohanreddy) కాళ్లకు నొప్పి వస్తోందని, గన్నవరంలో వలస నాయకుడిని తీసుకుంది ఎవరని ప్రశ్నించారు. వంశీ (Vamshi) టీడీపీ ఎమ్మెల్యే అయితే ఆయనను తీసుకుంది అధికార పార్టీనే కదా అని అన్నారు.
ఈరోజు సాయంత్రం గన్నవరంలో జరిగే టీడీపీ సమావేశం (TDP Meeting) ‘నభూతో నభవిష్యతి’ అనే విధంగా ఉంటుందని రఘురామ అన్నారు. లోకేష్ మీటింగ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్‌కు వెళ్తారన్నారు. లోకేష్ నాలుగు కిలోమీటర్లు కూడా నడవలేరని అన్నారు... ఏకంగా 4500 కిలో మీటర్లు నడవడానికి సిద్దమయ్యారని, ఇప్పటికే 2,500 కిలో మీటర్లు లోకేష్ నడిచారన్నారు. దొంగ ఓట్ల నమోదుపై కేంద్ర ఎన్నికల సంఘానికి గతంలో లేఖ రాశానని, దొంగ ఓట్లు నమోదు చేసే అధికారులపై చర్యలు తీసుకునేలా కోర్టులో కూడా పిటిషన్ వేస్తామన్నారు. అలాంటి అధికారులపై ప్రజలు కూడా ఫిర్యాదు చేయాలని రఘురామకృష్ణంరాజు సూచించారు.
Updated Date - 2023-08-22T15:40:05+05:30 IST