Perni Nani : మనం రూలింగ్‌లో ఉన్నాం.. అధికారులను ప్రశ్నించకండి..
ABN, First Publish Date - 2023-11-14T13:56:35+05:30
మచిలీపట్నం జడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యులకు వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని పాఠాలు చెప్పారు. మనం రూలింగ్‌లో ఉన్నామని.. అసంబద్ధ ప్రశ్నలు అధికారులపై సంధించవద్దంటూ హితబోధ చేశారు. వారందరినీ తాను గాడిన పెట్టేందుకే చెబుతున్నారనని.. అధికారులు పరిష్కరించ లేని సమస్యలను ఇక్కడ ప్రశ్నించవద్దని సూచనలు చేశారు. వారి చేతుల్లో పరిష్కారం లేని సమస్యలను ప్రశ్నించి ఆంధ్రజ్యోతి, ఈనాడు రిపోర్టర్లకు అవకాశం ఇవ్వవద్దని తెలిపారు.
విజయవాడ : మచిలీపట్నం జడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యులకు వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని పాఠాలు చెప్పారు. మనం రూలింగ్‌లో ఉన్నామని.. అసంబద్ధ ప్రశ్నలు అధికారులపై సంధించవద్దంటూ హితబోధ చేశారు. వారందరినీ తాను గాడిన పెట్టేందుకే చెబుతున్నారనని.. అధికారులు పరిష్కరించ లేని సమస్యలను ఇక్కడ ప్రశ్నించవద్దని పేర్ని నాని సూచనలు చేశారు. వారి చేతుల్లో పరిష్కారం లేని సమస్యలను ప్రశ్నించి ఆంధ్రజ్యోతి, ఈనాడు రిపోర్టర్లకు అవకాశం ఇవ్వవద్దని తెలిపారు.
ఈ నేపథ్యంలో సమావేశానికి గైర్హాజరైన ఏలూరు జిల్లా కలెక్టర్‌పై పేర్ని నాని ఫైర్ అయ్యారు. సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని ఫైర్ అవ్వాల్సిన ప్రజా ప్రతినిధులకు అస్సలు ప్రశ్నించవద్దంటూ పేర్ని నాని హితబోధ చేయడంతో సదరు సభ్యులంతా అవాక్కయ్యారు. ఎవరైనా రూలింగ్‌లో ఉన్నాం.. ఏదన్నా అయితే ప్రభుత్వం చూసుకుంటుంది. మీరసలు పని చేయని అధికారులను నిలదీయండని చెప్పాల్సిన ఎమ్మెల్యేనే ఇలాంటి సూచనలు చేయడమేంటని చర్చించుకుంటున్నారు.
Updated Date - 2023-11-14T13:56:37+05:30 IST