ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SupremeCourt: జీవో నెం-1పై సుప్రీంలో పిటిషన్

ABN, First Publish Date - 2023-04-17T12:29:03+05:30

జీవో -1పై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జీవో -1పై సుప్రీం కోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌ను ఈనెల 24న విచారించేందుకు సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం స్వీకరించింది. రాజకీయ పార్టీల ర్యాలీలను నిషేదిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో 1ను జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ సీపీఐ నేత రామకృష్ణ (CPI Leader Ramakrishna) ఏపీ హైకోర్టు (AP HighCourt) లో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణను పూర్తి చేసిన ఏపీ సీజే బెంచ్.. తీర్పును రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో తీర్పు జాప్యం నేపథ్యంలో పిటీషినర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

రాజకీయ పార్టీల ర్యాలీలను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో -1ను సవాల్ చేస్తూ ఈరోజు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై వెంటనే విచారణ జరగాలని పిటిషనర్లు కోరగా.. ఈనెల 24న విచారణ జరిపేందుకు సీజేఐ ధర్మాసనం అనుమతించింది. అయితే ఈ అంశంపై సుమారు మూడు నెలల పాటు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కాగా.. హైకోర్టు తీర్పును రిజర్వ్ చేయడంతో.. పిటిషనర్లు సుప్రీంను ఆశ్రయించారు. జీవో-1పై విచారణ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముందుగా వెకేషన్ బెంచ్ ఈ జీవోపై స్టే ఇవ్వగా.. సీజే బెంచ్ ఆ స్టేను ఎత్తివేసింది. కేసును స్వీకరించడం ద్వారా వెకేషన్ బెంచ్ పరిధిని మించి వ్యవహరించిందని సీజే ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రతీ కేసు ముఖ్యమైందంటే హైకోర్టు ఏం అయిపోవాలి... ఇలాంటివి జరిగితే ప్రతీ వెకేషన్ జడ్జి.. చీఫ్ జస్టిస్ అయినట్లే అని వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు అంత అత్యవసరమేమీ కాదని.. కేసు మూలాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నామని హైకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు చేశారు. అయితే సీపీఐ నేత రామకృష్ణ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం విచారణను పూర్తి చేసి.. తీర్పును రిజర్వ్ చేసింది. అయితే తీర్పు వచ్చి మూడు నెలలపైనే అవుతున్పటికీ జాప్యం అవుతున్న నేపథ్యంలో పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈనెల 24న సుప్రీంలో విచారణ జరుగనుంది. ఈ లోపు ఏపీ హైకోర్టు తీర్పుపై తేదీ ఇచ్చినట్లైతే సుప్రీం కోర్టులో ఈ కేసును పిటిషన్‌ను ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - 2023-04-17T12:38:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising