ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gannavaram Police: పట్టాభిని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పోలీసుల పిటిషన్

ABN, First Publish Date - 2023-02-24T13:19:29+05:30

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గన్నవరం కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి (TDP National Spokesperson Kommareddy Pattabhi)ని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గన్నవరం కోర్టు (Gannavaram Court)లో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు కోర్టులో విచారణ జరుగనుంది. హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ, అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులో పట్టాభి (Pattabhi)కి గన్నవరం కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. గన్నవరం నియోజకవర్గంతో సంబంధం లేని పట్టాభి రావడం వెనుక కుట్ర కోణంపై అనుమానం ఉందని పోలీసులు పిటిషన్‌లో పేర్కొన్నారు. మరో కేసులో కూడా పట్టాభి నిందితుడిగా ఉండటంతో కోర్టులో హాజరుపరచాల్సి ఉందని తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కోసం పట్టాభిని ఇంకా విచారించాల్సి ఉందని.. రెండు రోజుల పాటు పట్టాభిని కస్టడీ ఇవ్వాలని గన్నవరం పోలీసులు (Gannavaram Police) పిటిషన్‌లో కోరారు.

అయితే ఇదే సమయంలో పట్టాభికి బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు విజయవాడ కోర్టులో నిన్న పిటిషన్‌ దాఖలు చేశారు. ఈరోజు పట్టాభితో అరెస్ట్ అయిన మరో 12 మందికి కూడా బెయిల్‌ ఇవ్వాలని విజయవాడ కోర్టులో వాళ్ల తరపు న్యాయవాదులు పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే పట్టాభిని పోలీస్‌ కస్టడీకి ఇవ్వాలని గన్నవరం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై పట్టాభి తరపు న్యాయవాదులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాతే పట్టాభి పోలీస్‌ కస్టడీపై గన్నవరం కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Updated Date - 2023-02-24T13:19:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising