ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Purandeswari: నాపై గురతర బాధ్యతలు ఉన్నాయి..

ABN, First Publish Date - 2023-07-16T13:51:02+05:30

విజయవాడ: తనపై గురతర బాధ్యతలు ఉన్నాయని, పార్టీని బలోపేతం చేయడం తన ఒక్కరి వల్లే సాధ్యం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఆదివారం విజయవాడలో ఆమె అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: తనపై గురతర బాధ్యతలు ఉన్నాయని, పార్టీని బలోపేతం చేయడం తన ఒక్కరి వల్లే సాధ్యం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఆదివారం విజయవాడలో ఆమె అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త తనకు సహకారం అందించినప్పుడే పార్టీ బలోపేతం సాధ్యం అవుతుందన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజలకు చేరువ చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 2014 తర్వాత పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఒంటరిగా వెళ్లాలని చాలా మంది సూచించారని, అయితే పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ముందు కసరత్తు చేయాలని అధినాయకత్వం సూచించిందన్నారు. ఎన్నికలకు ఇంకా ఐదారు నెలల సమయమే ఉందని, అన్ని స్థాయిల్లోని కమిటీలను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు.. రాజకీయంగా వేసే అడుగులపైనా ఆలోచించాలన్నారు. ఏపీలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పాలిస్తోందని, మద్యం డిస్టిలరీస్ అన్నీ అధికార పార్టీ పెద్దల సన్నిహితులకే ఇచ్చారని విమర్శించారు. మద్యం అమ్మకాల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతోందని, సీఎం ఇంటి సమీపంలో అత్యాచారం జరిగినా న్యాయం జరగని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు.

పదో తరగతి పిల్లవాడిని.. ఓ ఉపాధ్యాయుడిని పట్ట పగలు చంపేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ నొక్కితే చాలు పోలీసులొచ్చేస్తారని సీఎం జగన్ చెప్పారు.. కానీ అలా జరుగుతోందా..? అని ప్రశ్నించారు. యువతకు ఉపాధి అన్నారు.. కానీ అలా జరగడం లేదని, వాలంటీర్లు పర్మినెంట్ ఉద్యోగులు కారని, వారిని కలుపుకుని ఉపాధి కల్పించామనే లెక్కలు వేసి చెబుతున్నారని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని.. వచ్చిన పరిశ్రమలు ఉండడం లేదని, లూలూ, జాకీ వంటి కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయన్నారు. రాష్ట్రంలో ఇసుక దందా భారీ ఎత్తున జరుగుతోందని ఆరోపించారు. సుప్రీం కోర్టు కూడా ఇసుక తవ్వకాలు ఆపాలని ఆదేశించిందన్నారు.

అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడానికి అక్రమ ఇసుక తవ్వకాలే కారణమని పురంధేశ్వరి ఆరోపించారు. ఇసుక మాఫియా వల్ల పేదల జీవితాలు రోడ్డున పడ్డాయని, భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేవని, ఇసుక మాఫియాతో నేతలు జేబులు నింపుకోవడమే కాదు.. పేదల జీవితాలు ఛిద్రమవుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలపై పోరాడితేనే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్నారు. సర్పంచులు పార్టీలకతీతంగా దారి మళ్లిన నిధుల కోసం ఆందోళన చేస్తున్నారని, రాష్ట్రంలో ఎటు చూసినా సమస్యల వలయమే కనిపిస్తోందన్నారు. కేంద్రం ఏపీకి అనేక రకాలుగా సహకారం అందిస్తోందని, ఇళ్లకు రంగులు మార్చడంపై ఉన్న శ్రద్ధ.. ఇళ్ల నిర్మాణంపై చెప్పడం లేదని మండిపడ్డారు. కేంద్ర నిధులను పక్క దోవ పట్టిస్తోందని, ఏపీ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిందని పురంధేశ్వరి పేర్కొన్నారు. ఈ సమావేశానికి పదాధికారులతో పాటు రాష్ట్రస్థాయి , జిల్లాస్థాయి నేతలు హాజరయ్యారు.

Updated Date - 2023-07-16T13:51:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising