ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Raghurama: జగన్మోహన్ రెడ్డి పర్యవేక్షణలోనే నాపై కుట్ర..

ABN, First Publish Date - 2023-06-14T15:40:54+05:30

న్యూఢిల్లీ: గతంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్‌పై నిన్న హైకోర్టులో వాదనలు జరిగాయని, తన సెక్యూరిటీని రానివ్వకుండా పోలీసులు తనను తీసుకువెళ్లి మెడికల్ పరీక్షలు చేయించారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: గతంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్‌ (Custodial Torture) పై నిన్న హైకోర్టు (High Court)లో వాదనలు జరిగాయని, తన సెక్యూరిటీని రానివ్వకుండా పోలీసులు తనను తీసుకువెళ్లి మెడికల్ పరీక్షలు చేయించారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు (Raghuramakrishnamraju) అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తనను జైల్ నుంచి బయటకు రానివ్వరు అనుకొని డాక్టర్ ప్రభావతి (Dr. Prabhavathi) తప్పుడు రిపోర్టులు ఇచ్చారని చెప్పారు. న్యాయమూర్తి తనను రమేష్ హాస్పిటల్‌కు తీసుకెళ్ళమని చెప్పిన పోలీసులు తీసుకెళ్ల లేదని, సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) పర్యవేక్షణలోనే తనపై కుట్ర జరిగిందని రఘురామ స్పష్టం చేశారు. కోర్టు ఆర్డర్‌ను ఉల్లంఘించారని, సీఎం జగనే తన కస్టోడియల్ టార్చర్‌కు బాధ్యులని, తనను జైల్లో వేసేయాలని ముఖ్యమంత్రి అనుకున్నారని, కానీ కుదరలేదన్నారు. నమ్మకున్న దేవుడే తనకు న్యాయం చేశాడన్నారు. సుప్రీంకోర్టు (Supreme Court) జోక్యంతో బయటకు వచ్చానని, కామన్ మ్యాన్‌ను సహితం ప్రభుత్వం ఎంతో ఇబ్బంది పెడుతోందని రఘురామ అన్నారు.

కాగా జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వారాహి యాత్ర (Varahi Yatra) విజయవంతం కావాలని కోరుకుంటున్నానని రఘురామ అన్నారు. వైసీపీ నేతలు (YCP Leaders) పోలీసుల సహకారంతో పవన్ యాత్రకు నాయకులను రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కొందరి బండ్లను అపేసి లైసెన్స్‌లు తీసుకున్నారని తెలిసిందన్నారు. వారాహి యాత్ర ఎలా ఉంటుందో ఈ సాయంత్రం చూడాలన్నారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల నిరసన ఎలా ఉందో కూడా ఈ రోజు కనిపిస్తుందన్నారు. రాజకీయ సమరశంఖం పూరించిన పవన్ కళ్యాణ్‌కు రఘురామ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2023-06-14T15:40:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising