ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Raghurama.. మూడు విడతల్లో మద్యపాన నిషేధం అన్నారు..

ABN, First Publish Date - 2023-09-22T13:58:10+05:30

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపానం నిషేధం చేస్తామని అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, మూడు విడతల్లో మద్యపాన నిషేధం చేస్తామని అన్నారని.. ఇప్పుడు ఆ హామీ ఏమైందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (Andhra Pradesh State)లో మద్యపానం నిషేధం (Alcohol Prohibited) చేస్తామని అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) హామీ ఇచ్చారని, మూడు విడతల్లో మద్యపాన నిషేధం చేస్తామని అన్నారని.. ఇప్పుడు ఆ హామీ ఏమైందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghurama Krishnamraju) ప్రశ్నించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్యంపై అప్పులు తీసుకొచ్చారని, చెప్పింది చేయకపోతే చొక్కా పట్టుకోవాలని అన్నారు. కోవత్తుల నిరసన తెలిపినా కూడా అరెస్ట్ చేస్తారా? పోలీసులు (Police) పనికిమాలిన చర్యలు మానుకోవాలని సూచించారు. మద్యంపై వచ్చే ఆదాయం ఎవరికీ వెళుతుందనే అంశంపై సీబీఐ (CBI) విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (Skill Development Case)ను సీబీఐతో విచారణ చేయించాలని కేసు వేశారని, సీబీఐ విచారణకు ఆదేశిస్తే ముందు గవర్నర్ అనుమతి అవసరమని రఘురామకృష్ణంరాజు అన్నారు. ఉండవల్లి ఏ ఉద్దేశ్యంతో పిటిషన్ వేశారో తెలియదని, ఏసీబీ కోర్టు (ACB Court)లో తీర్పు ఇస్తామని అన్నారు, సీరియల్ లాగా తేదీలను వాయిదా వేసుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏసీబీ కోర్టు జడ్జి తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలన్నారు. ప్రపంచంలో ఉన్న తెలుగు వారు 90 శాతం మంది చంద్రబాబుకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Updated Date - 2023-09-22T13:58:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising