Raghurama: పవన్ కళ్యాణ్ తన మనసులో మాట చెప్పారు..
ABN, First Publish Date - 2023-04-06T14:38:46+05:30
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర పెద్దలను కలిశారని.. దీన్ని వైసీపీ వాళ్లు సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు.
ఢిల్లీ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఢిల్లీ పర్యటనలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ఇతర పెద్దలను కలిశారని.. దీన్ని వైసీపీ వాళ్లు సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు (Raghurama Krishnamraju) విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) పొత్తులపై స్పష్టంగా చెప్పారన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) కూడా బీజేపీ (BJP), జనాసేన (Janasena) మాత్రమే పొత్తు అని చెప్పారన్నారు. రాష్ట్ర ప్రజలకు వైసీపీ (YCP) నుంచి విముక్తి కల్పిస్తామని, అందులో భాగంగా సమావేశాలు జరిపామని, ప్రతిపక్షాల ఓటు చిలనివ్వనని పవన్ తన మనసులో మాట స్పష్టంగా చెప్పారన్నారు.
ఏపీలో దుష్ట పాలన అంతం చేయాలంటే అందరం కలిసి పోరాటం చేయాలని పవన్ చెప్పారని రఘురామ అన్నారు. రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్తాయని, భవిష్యత్‌లో టీడీపీ, జనసేన కలిసి ముందుకు వెళ్ళే అవకాశముందని కేంద్రంలో ఉన్న బీజేపీనే టీడీపీ, జనసేనాను కలుపుతుందనే నమ్మకం ఉందని రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ మూడు పార్టీలు కలిస్తే వైసీపీ వాళ్లకు ఇబ్బందులు తప్పవన్నారు.
టీడీపీ ఎంపీ కనకమెడల రవీంద్రకుమార్ నిన్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిశారని రఘురామ అన్నారు. ప్రధానితో జరిగిన చర్చల అంశాన్ని మాత్రమే కనకమేడల చెప్పారన్నారు. పంజాబ్ మాదిరిగా ఏపీ మారిందని, శాంతి భద్రతలు రోజు రోజుకి క్షీణించిపోతున్నాయని మోదీ ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆయన చెప్పారని రఘురామ అన్నారు.
Updated Date - 2023-04-06T14:38:46+05:30 IST