Raghurama: జగనన్న ప్రోగ్రాం పెడితే మాత్రం హిట్ అవుతుంది...
ABN, First Publish Date - 2023-04-04T14:22:47+05:30
ఢిల్లీ: ఏపీ ప్రభుత్వం పథకాలపై (AP Govt. Schemes ) నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు (Raghurama Krishnamraju) కామెంట్స్ చేశారు.
ఢిల్లీ: ఏపీ ప్రభుత్వం పథకాలపై (AP Govt. Schemes ) నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు (Raghurama Krishnamraju) కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఉండమ్మ బొట్టు పెడతా అనే స్కీమ్ పెడితే బాగుంటుందని.. మహిళల పథకాలకు విజయలక్ష్మి (Vijayalakshmi), భారతి (Bharathi) పేరు పెట్టుకుంటే ఇంకా బాగుంటుందని సూచించారు. సీఎం (CM) కోసం జగనన్న (Jagananna) ప్రోగ్రాం పెడితే మాత్రం హిట్ అవుతుందని, చాలామంది జనం ఎదురు చూస్తున్నారన్నారు.
సింగిల్ జడ్జి బెంచ్‌లో మ్యాటర్ వస్తే సిజే బెంచ్‌కు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది అన్నారని, చాలా కేసులు సీజేకు ఇవ్వాలని వైసీపీ నేతలు (YCP Leaders) అంటున్నారని రఘురామ అన్నారు. గతంలో ఉషోదయ పబ్లికేషన్ కేసు (Ushodaya Publication Case), అమరావతి భూముల కేసు (Amaravathi Lands Case), జీవో నంబర్ 1 (Go 1).. అన్ని కూడా సీజే బెంచ్ అంటున్నారని.. జీవో నంబర్ 1పై ఇప్పటి వరకు జడ్జిమెంట్ రాలేదని.. వస్తుందని అనుకోనని.. దీనిపై తాను కామెంట్ చేయనని అన్నారు. అమరావతి భూముల కేటాయింపులో స్టే ఇవ్వలేదని.. కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చారన్నారు. జడ్జిమెంట్ అంశం న్యాయమూర్తి నిర్ణయమని... న్యాయం చేసినట్టు కూడా ఉండాలని.. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు.
ప్రజల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయేలా ప్రభుత్వ ఏజీ వ్యవహరిస్తున్నారని, ఆయన తీరు సరిగా లేదని రఘురామ విమర్శించారు. ప్రజలు రాత్రులు ఇళ్లలో ఎం మాట్లాడుకుంటున్నారో సీఎం జగన్ (CM Jagan) తెలుసుకుంటే మంచిదన్నారు. అమరావతి రైతులు (Amaravathi Farmers) బాధపడొద్దని... ధైర్యంగా ఉండాలని సూచించారు. సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలు చేస్తే...న్యాయం జరుగుతుందన్నారు. పేదల కడుపులు కొట్టేవారు బాగుపడరని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-04-04T14:22:47+05:30 IST