ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Raghurama: మా పార్టీకి కష్టాలు తప్పేలా లేవు..

ABN, First Publish Date - 2023-07-28T14:05:40+05:30

DelhiRaghurama Press Meet in Delhi న్యూఢిల్లీ: కొన్ని సర్వే ఏజెన్సీల ద్వారా వచ్చిన రిపోర్టులను చూస్తుంటే... వైసీపీ పార్టీకి కష్టాలు తప్పేలా లేవని, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ వాళ్లకు 4,5 స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

న్యూఢిల్లీ: కొన్ని సర్వే ఏజెన్సీల ద్వారా వచ్చిన రిపోర్టులను చూస్తుంటే... వైసీపీ (YCP) పార్టీకి కష్టాలు తప్పేలా లేవని, లోక్ సభ (Lok Sabha) ఎన్నికల్లో వైసీపీ వాళ్లకు 4, 5 స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghurama Krishnamraju) అన్నారు. ఏపీ ఓటర్ (AP Voter) మదిలో ఏముంది? అన్న మీడియీ ప్రశ్నకు సమాధానంగా శుక్రవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. 2009లో కాంగ్రెస్ (Congress) విజయం సాధించిందని, అనంతరం ఏపీలో కాంగ్రెస్ పార్టీ కాస్తా వైఎస్సార్సీపీగా మారిందన్నారు. గతంలో కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లు వైఎస్సార్సీపీకి వేశారని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.

ఇప్పుడు 6 శాతం మేర ఓట్లు వైఎస్సార్సీపీకి నష్టం చేయనున్నాయని, ముస్లిం (Muslim), మైనార్టీ (Minority) ఓట్లు రాజశేఖర్ రెడ్డి (Rajasekhar Reddy)ని చూసి ప్రజలు వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారని రఘురామ అన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముస్లిం సోదరులు కాంగ్రెస్‌కు వేసే పరిస్థితి వచ్చిందన్నారు. గెలుపుతో సంబంధం లేకపోయినా కాంగ్రెస్‌కు సంప్రదాయంగా వేసే అవకాశం ఉందన్నారు. రాబోయే రోజుల్లో కడప, రాజంపేటపై ప్రభావం పడే అవకాశం ఉందని, వైఎస్సార్సీపీకి సాలిడ్ ఓటు బ్యాంకు అయిన ఎస్సీ (SC), ఎస్టీ (ST)లో కొంత శాతం మార్పు కనిపిస్తోందన్నారు. అందరూ అనుకుంటున్నట్లు షర్మిల (Sharmila) ఏపీలో కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇంకా ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 40 సీట్లు మాత్రమే వచ్చే విధంగా కనిపిస్తోందని, సజ్జల (Sajjala) సయితం ఎన్నికలపై మాట్లాడడం లేదన్నారు. పొత్తులపై అధికారికంగా ప్రకటన రావడానికి కొంత సమయం పడుతుందని, ప్రతిపక్షాల ఓట్లు చీలవని రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-07-28T14:05:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising