CM Jagan: ఢిల్లీలో తగ్గిన సీఎం జగన్ పరపతి.. పట్టించుకోని మోదీ, అమిత్ షాలు
ABN, First Publish Date - 2023-04-18T15:35:09+05:30
ఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)కి ఢిల్లీలో పరపతి తగ్గింది. బీజేపీ నేతలు (BJP Leaders) జగన్‌కు మొహం చాటేస్తున్నారు.
ఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)కి ఢిల్లీలో పరపతి తగ్గింది. బీజేపీ నేతలు (BJP Leaders) జగన్‌కు మొహం చాటేస్తున్నారు. అటు ప్రధనమంత్రి నరేంద్రమోదీ (PM Modi), హోంమంత్రి అమిత్ షా (Amit Shah)లు కూడా పట్టించుకోవడంలేదు. వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka Murder Case) నేపథ్యంలో సీఎం ఢిల్లీకి రావాలనుకున్నారు. అయితే ముఖ్యమంత్రికి ఢిల్లీలో ఎవరి అపాయింట్‌మెంట్ లభించకపోవడంతో సైలంట్ అయ్యారు. కర్నాటక ఎన్నికల్లో (Karnataka Elections) బిజీగా ఉన్నామని బీజేపీ అగ్రనేతలు తప్పించుకుంటున్నారు.
ఢిల్లీలో బీజేపీ ఎంపీలు సీఎం రమేష్ (CM Ramesh), సుజనా చౌదరీ (Sujana Choudari)లు చక్రం తిప్పుతున్నారు. దీంతో బీజేపీ నేతలు జగన్‌కు దూరం అవుతున్నారు. ఢిల్లీపైనే గంపెడాశలు పెట్టుకున్న సీఎం జగన్ ప్రధాని మోదీ, అమిత్ షాల అపాయింట్ మెంట్ల కోసం శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వారి అపాయింట్‌మెంట్లు లభిస్తే ఏ నిమిషంలోనైనా జగన్ ఢిల్లీకి రావాలనుకుంటున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డిని దూరం పెట్టడంతో జగన్‌ను కొత్త సమస్యలు చుట్టుముట్టాయి. ఢిల్లీలో జగన్ తరపున చక్రం తిప్పే నేతే లేకుండా పోయారని వైసీపీ ఎంపీలు భావిస్తున్నారు.
Updated Date - 2023-04-18T17:03:45+05:30 IST