Chandrababu: టీడీపీ మహిళా నేత కల్యాణి అరెస్ట్‌ను ఖండించిన చంద్రబాబు
ABN, First Publish Date - 2023-04-10T12:00:32+05:30
తెలుగు మహిళా నేత కల్యాణి అరెస్ట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.
అమరావతి: తెలుగు మహిళా నేత మూల్పూరి కల్యాణి (TDP Leader Mulpuri Kalyani) అరెస్ట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్పూరి సాయి కళ్యాణిపై తప్పుడు కేసు పెట్టిందే కాక... బెడ్ రూంలోకి చొరబడి ఆమెను ఏదో ఉగ్రవాదిలా అరెస్టు చేసిన విధానం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించిన మహిళపై హత్యాయత్నం కేసు పెట్టి ప్రతాపం చూపడం సిగ్గుచేటు! అంటూ చంద్రబాబు నాయుడు (TDP Chief) విమర్శలు గుప్పించారు.
పోలీస్ వ్యవస్థకే కళంకం: లోకేష్
తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. ఒక మహిళ పట్ల ఇంత దారుణంగా వ్యవహరించి పోలీసు వ్యవస్థకే కళంకం తెచ్చారన్నారు. వైసీపీ నేతల మెప్పు కోసం తప్పుడు కేసులు బనాయిస్తూ, మహిళలని చూడకుండా వేధిస్తున్న ప్రతీ ఒక్కరూ చట్టం ముందు నిలబడే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. కళ్యాణికి టీడీపీ అండగా ఉందని, మీకెవరు మద్దతు వస్తారో చూస్తామని లోకేష్ పేర్కొన్నారు.
కాగా.. టీడీపీ మహిళా నేత మూల్పూరి కల్యాణి (Maalpuri Kalyani)ని హనుమాన్ జంక్షన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరంలో ఫిబ్రవరి 20న టీడీపీ (TDP), వైసీపీ (YCP) మధ్య జరిగిన గొడవలకు సంబంధించి నమోదైన రెండు కేసుల్లో కల్యాణి నిందితురాలిగా ఉన్నారు. దీంతో ఆమెకు ముందస్తు బెయిల్ (Anticipatory Bail) రాకపోవడంతో అప్పటి నుంచి అజ్ఞాతం (Anonymity)లోకి వెళ్లిపోయారు. కాగా హనుమాన్ జంక్షన్‌లోని తన నివాసంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో సోమవారం తెల్లవారుజామున కల్యాణి ఇంటిని ముట్టడించి, అదుపులోకి తీసుకున్నారు.
Updated Date - 2023-04-10T12:06:29+05:30 IST