Atchannaidu: ‘కల్యాణిని తక్షణమే విడుదల చేయాలి’
ABN, First Publish Date - 2023-04-10T12:18:48+05:30
టీడీపీ మహిళా నేత మూల్పూరి కల్యాణి అక్రమ అరెస్ట్‌ను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు.
అమరావతి: టీడీపీ మహిళా నేత మూల్పూరి కల్యాణి (Mulpuru Kalyani) అక్రమ అరెస్ట్‌ను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (TDP Leader Atchannaidu) తీవ్రంగా ఖండించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ (AP CM Jaganmohan Reddy)దుర్మార్గాలను ప్రశ్నించిన కల్యాణిపై అక్రమంగా హత్యాయత్నం కేసు నమోదం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. బెడ్ రూంలోకి చొరబడి ఉగ్రవాదిలా అరెస్ట్ చేయడం రాజారెడ్డి రాజ్యాంగానికి నిదర్శనమన్నారు. జగన్ రెడ్డి (AP CM) మెప్పు కోసం పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల (YCP Leaders) అవినీతి, దమనకాండ రోజురోజుకూ పెరిగిపోతోందన్నారు. ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలనే లక్ష్యంగా చేసుకుని అణచివేతకు పాల్పడుతున్నారని అన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన కల్యాణిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని.. లేనిపక్షంలో మహిళలు తగిన బుద్ధి చెబుతారని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
కాగా... టీడీపీ నేత మూల్పూరి కల్యాణి (Maalpuri Kalyani)ని హనుమాన్ జంక్షన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరంలో ఫిబ్రవరి 20న టీడీపీ (TDP), వైసీపీ (YCP) మధ్య జరిగిన గొడవలకు సంబంధించి నమోదైన రెండు కేసుల్లో కల్యాణి నిందితురాలిగా ఉన్నారు. దీంతో ఆమెకు ముందస్తు బెయిల్ (Anticipatory Bail) రాకపోవడంతో అప్పటి నుంచి అజ్ఞాతం (Anonymity)లోకి వెళ్లిపోయారు. కాగా హనుమాన్ జంక్షన్‌లోని తన నివాసంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో సోమవారం తెల్లవారుజామున కల్యాణి ఇంటిని ముట్టడించి, అదుపులోకి తీసుకున్నారు.
Updated Date - 2023-04-10T12:18:48+05:30 IST