ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Devineni Uma: వివేకా హత్య కేసుకు బాధ్యత వహిస్తూ జగన్‌ రాజీనామా చేయాలి...

ABN, First Publish Date - 2023-04-16T14:07:05+05:30

ఎన్టీఆర్ జిల్లా: పాలిటిక్స్ డైవర్ట్ చేసేందుకు రామోజీరావును టార్గెట్ చేస్తూ.. సిఐడిని దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్ జిల్లా: పాలిటిక్స్ డైవర్ట్ చేసేందుకు రామోజీరావును టార్గెట్ చేస్తూ.. సిఐడిని దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇకపై జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం నడవదని జగన్ పని అయిపోయిందని అన్నారు. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లు ముద్దాయిని కాపాడిన సీఎం జగన్.. అసెంబ్లీలో ఒక కన్ను.. మరో కన్ను అని వేదాంతం చెప్పి ప్రజలను మభ్య పెట్టారని.. వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయిల అరెస్టుపై జగన్మోహన్ రెడ్డి నోరు తెరవాలన్నారు.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నోరు తెరవాలని, బూతుల మంత్రి కొడాలి నాని దీనికి సమాధానం చెప్పాలని దేవినేని ఉమా అన్నారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని, షెడ్యూల్ 9, 10 ప్రకారం లక్ష కోట్ల రూపాయల ఆస్తి రావాలని.. దానిని తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. కృష్ణా జలాల్లో సగం వాటా తమవే అంటూ తెలంగాణ వారు వాదిస్తున్నారని.. అయినా జగన్ ప్రభుత్వం మూసుకు కూర్చుందని ఎద్దేవా చేశారు. గోదావరి చింతలపూడి ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోవడం హాస్యాస్పదమని దేవినేని ఉమా వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-04-16T14:07:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising